Site icon Prime9

CM Jagan: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్

cm jagan tirumala tour

cm jagan tirumala tour

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుపతి జిల్లాలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

ఈ రోజు 3.15 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరి 3.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.45గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 4.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో సీఎం జగన్ తిరుమలకు వెల్లనున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుపతిలోని గంగమ్మ తల్లి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అలిపిరిలో విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 07:45 గంటలకు బేడి ఆంజనేయస్వామిని సీఎం దర్శించుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా తిరుమల వచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఈ నెల 28వ తేదీ ఉదయం సీఎం జగన్ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుమలలో పరకామణి భవనంతో పాటు లక్ష్మీవీపీఆర్ రెస్ట్ హౌస్ ను ప్రారంభిస్తారు. ఉదయం 8:45 గంటలలకు సీఎం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన ఓర్వకల్లు కు వెళ్తారు.

సీఎం తిరుమలకు రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ప్రయాణం చేసే మార్గంలో పటిష్ట నిఘా ఉంచారు.

ఇదీ చదవండి:  డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు రండి

Exit mobile version