Durgamma: దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్

ప్రముఖ శక్తి దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకొన్నారు

CM Jagan: ప్రముఖ శక్తి దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకొన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకొన్న సీఎం జగన్ కు మంత్రులు కొట్టు సత్యన్నారాయణ, తానేటి వనితలు ఘన స్వాగతం పలికారు. దేవదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో సీఎం కు స్వాగతం పలికారు. అనంతరం కనకదుర్గను దర్శించుకొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వేద ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు జగన్ కు అందచేశారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. సీఎం రాకను పురస్కరించుకొని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ వెంట ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాల నానిలు ఉన్నారు. దసరా రోజుల్లో వెల్లంపల్లి పోలీసు విధులకు ఆటంకం కల్గిస్తూ తన అనుచరులను వాహనాలతో కొండపైకి చేరుకొన్న సంఘటన అందరికి తెలిసిందే.

ఇది కూడా చదవండి: CM KCR: మరగుజ్జులు మహాత్ములు కాలేరు….సీఎం కేసిఆర్