Site icon Prime9

Allu Arjun: మేనల్లుడిని హత్తకుని ఎమోషనలైన చిరంజీవి భార్య సురేఖ

Chiranjeevi Wife Surekha Meets Allu Arjun: మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ అల్లు అర్జున్‌ని కలిశారు. మేనల్లుడిని పట్టుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. సంధ్య థియేటర్‌్లో ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రిమాండ్‌ విధించి చంచల్‌గూడ్‌ జైలుకు తరలించారు. ఈ రోజు ఉదయం బైయిల్‌పై బయటకు వచ్చిన బన్నీ చూసేందుకు సినీ ప్రముఖులంతా జుబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలివస్తున్నారు.

డైరెక్టర్స్‌ సుకుమార్‌, వంశీ పైడిపల్లి,హరీష్‌ శంకర్‌, కొరటాల శివతో పాటు హీరోలు నాగచైతన్య,శ్రీకాంత్‌, విజయ్‌ దేవరకొండ ఇలా పలువురు సినీ ప్రముఖులంతా బన్నీ నివాసానికి తరలివస్తున్నారు. అలాగే చిరంజీవి సతీమణి,అల్లు అర్జున్‌ మేనత్త సురేఖ వచ్చి బన్నీని కలిశారు. మేనల్లుడి చూడగానే హత్తకుని ఆమె కన్నీరు పెట్టుకున్న తీరు ప్రతిఒక్కరిని ఎమోషన్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఇదిలా ఉంటే విడుదల అనంతరం బన్నీ తన నివాసం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అలాగే మృతురాలు రేవతి కటుంబానికి క్షమాపణలు చెప్పారు. త్వరలోనే వారి కుటుంబాన్ని కలుస్తానని, వారికి కావాల్సిన సాయం అందిస్తానన్నారు. కాగా పుష్ప 2 మూవీ డిసెంబర్‌ 5న గ్రాండ్‌గా రిలీజైంది. ఈ క్రమంలో ముందు రాత్రి గ్రాండ్‌ ప్రీమియర్స్‌,బెన్‌ఫిట్‌ షోలు వేశారు.

దీంతో సినిమా చూసేందుకు అల్లు అర్జున్‌ భార్య పిల్లలతో పాటు హీరోయిన్‌ రష్మిక మందన్నాతో కలిసి ప్రీమియర్స్‌ చూసేందుకు థియేటర్‌కి వచ్చారు. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి ఆయనను చూసేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోగా రేవతి అనే మహిళ మరణించారు. ఈ ఘటనను సీరియస్‌ తీసుకున్న పోలీసులు సంధ్య థియేటర్‌ యాజమాన్యంలోని ముగ్గురితో పాటు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండ బన్నీ థియేటర్‌ వచ్చారని, అందువల్ల ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version