Site icon Prime9

Megastar Chiranjeevi: ‘లక్కీ భాస్కర్‌’ చూసిన మెగాస్టార్‌ చిరంజీవి – స్వయంగా డైరెక్టర్‌ను కలిసిన చిరు.. ఏమన్నారంటే!

Chiranjeevi Meets Director Venky Atluri: సీతారామం ఫేం దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెలుగు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వలో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘లక్కీ భాస్కర్‌’. దీపావళి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్‌ 31న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతోంది. ఇక ఓవర్సిలోనూ వన్‌ మిలియన్‌ మార్క్‌ చేరుకుంది. ఇప్పటికి అదే జోరుతో కొనసాగుతుంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే అతిత్వరలోనే ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరేలా కనిపిస్తుంది.

ఇక లక్కీ భాస్కర్‌ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు డైరెక్టర్‌ వెంకి అట్లూరి పనితీరును కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి వీక్షించారు. ఈ మూవీ ఆయన బాగా నచ్చడంతో డైరెక్టర్‌ వెంకి అట్లూరి ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా అతడిని కలిసి పూల బోకే ఇచ్చారు. అనంతరం మూవీ మేకింగ్‌, యూనిట్‌ పనితీరును మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఈ మూవీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ తమ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

“మెగాస్టార్‌ చిరంజీవి మీ సినిమా చూసి.. స్వయంగా వచ్చి మీ పనితీరు అభినందిస్తే.. మీరు ప్రత్యేకంగా ఏదో సృష్టించారని అర్థం” అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అయ్యింది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఇందులో దుల్కర్‌ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా.. తమిళ నటుడు రామ్‌కీ, హైపర్‌ ఆది, సాయికుమార్‌, మానసచౌదరి, సచిన్‌ ఖేడేకర్‌ తదితర నటులు ముఖ్యపాత్రలు పోషించారు. పాన్‌ ఇండియాగా రిలీజ్‌ అయిన ఈ సినిమా 9 రోజుల్లోనే రూ. 69 కోట్ల గ్రాస్‌ చేసి వంద కోట్ల వసూళ్లకు చేరువవుతోంది.

Exit mobile version