Site icon Prime9

Waltair Veerayya : ఆ పరిస్థితి వస్తే సినిమాల నుంచి రిటైర్ అవుతానన్న చిరంజీవి

chiranjeevi comments about retirement in waltair veerayya press meet

chiranjeevi comments about retirement in waltair veerayya press meet

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తుండగా… శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా… మంగళవారం రాత్రి చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్‌ని నిర్వహించింది. ఈ మీట్‌కి చిరంజీవితో పాటు మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు బాబీ, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ తదితరులు వచ్చారు.

కాగా ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో మీడియా చిరంజీవి ముచ్చటించారు. ఈ సంధర్భంగా రిటైర్మెంట్ గురించి మెగాస్టార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ బిగినింగ్‌లో నటుడు ఇమేజ్ కోసం.. రిస్క్ చేస్తూ కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. మీరు కూడా గూండా సినిమాలో చేశారు. ఆ తర్వాత ఒక ఇమేజి వచ్చాక కూడా బావగారు బాగున్నారా మూవీలో బంగీ జంప్ చేశారు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌గా ఉన్న మీరు ఈ మూవీ కోసం -8 డిగ్రీల్లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? వర్షంలో తడస్తూ సీన్స్ చేయాలా?’’ అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి చిరంజీవి తనదైన శైలిలో బదులిచ్చారు.

కచ్చితంగా ఉంది. లేని రోజున బెటర్ రిటైర్… ఇంటికెళ్లిపో. ఈ మాట ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ చెప్తాను అని సమాధానం ఇచ్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. నువ్వు కమిట్ అయినప్పుడు.. పాత్రకి న్యాయం చేయాలని నువ్వు అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇబ్బందుల్ని నువ్వు ఇబ్బందిగా ఫీలవకూడదు. ఒకవేళ అయినా వాటిని కనబడనీయకూడదు. వాటికి తలొగ్గి చేయాల్సిందే. అలా చేసినప్పుడే ఈ ఫీల్డ్‌లో ఉండేందుకు నీకు అర్హత ఉంటుంది. లేదంటే ఇంటికెళ్లిపోవచ్చు. ఒక యాక్టర్‌గా నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నని మీతో వేయించుకోను. స్టార్ డమ్ ఊరికే రాదు రిస్క్ చెయ్యాలి అని మీరే అంటారు. వేషాలపై ఆకలితో ఉండాలి. ఒకవేళ ఆ ఆకలి చచ్చిపోయినప్పుడు ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోవచ్చు అని చెప్పుకొచ్చారు. అలానే ఈ సినిమా గురించి చెబుతూ అభిమానులందరికి ఈ చిత్రం ఫుల్ మీల్స్ లాంటిదని తెలిపారు.

Exit mobile version