SI Constable: బిగ్ అప్ డేట్.. ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్ష తేదీల్లో మార్పులు

SI Constable: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు కీలక సూచన చేసింది. ముందుగా నిర్ణయించిన పరీక్ష తేదీలను మారుస్తున్నట్లు తెలిపింది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీలను మార్చినట్లు బోర్డు తెలిపింది. మార్చిన తేదీలను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది.

రాష్ట్రంలో పోలీస్‌ నియామక తుది రాత పరీక్ష తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు జరిగినట్లు తెలిపింది. ఎస్సై, ఏఎస్సై.. కానిస్టేబుల్, (SI Constable) కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది.

టీఎస్ పీఎస్పీ చేసిన విజ్ఞప్తి మేరకు తేదీలు మార్చినట్లు ప్రకటించింది. పోలీస్ తుది రాత పరీక్షల సమయంలో టీఎస్ పీఎస్పీ నిర్వహించే పరీక్షలు ఉన్నాయని పోలీస్ నియామక బోర్డు తెలిపింది.

మారిన తేదీలు ఇవే

ఇక పోలీస్ తుది రాత పరీక్షలు ఈ తేదీల్లో ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 23న జరగాల్సిన పరీక్షను.. ఏప్రిల్ 30వ తేదీకి మార్చారు.

ఎస్సై పరీక్షను మార్చి 12 నుంచి 11వ తేదీకి మార్చారు. ఏఎస్సై (SI Constable) పరీక్షను మార్చి 12 నుంచి ఒక రోజు ముందుకు మార్చి 11 తేదీన నిర్వహిస్తామని టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ తెలిపింది.

ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష పూర్తైన సంగతి తెలిసిందే. పరీక్షా ఫలితాలను సైతం నియామక బోర్డు ప్రకటించింది. అనంతరం దేహధారుడ్య పరీక్షలను కూడా పూర్తి చేశారు.

ఇందులో అర్హత సాధించిన వారికి తుది పరీక్ష నిర్వహించడమే తరువాయి. కానీ ఇతర పరీక్షల నేపథ్యంలో పరీక్ష తేదీలను మార్చవలసి వచ్చిందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది.

పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలని నియామక బోర్డు తెలిపింది.

పరీక్ష తేదీలను గమనించుకోవాలని తెలిపింది. అభ్యర్ధుల తప్పుకు మేం బాధ్యులం కాదని నియామక బోర్డు తెలిపింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/