Rakshabandan: రక్షాబంధన్ జరుపుకుంటున్న ప్రముఖులు.. చిన్ననాటి ఫొటోలు పంచుకున్న మంత్రి కేటీఆర్

రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్టర్‌లో తన చిన్న నాటి జ్జాపకాలను పంచుకున్నారు. కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ చెల్లెలు కవితతో ఉన్న ఫొటోతో పాటు కూతురు అలేఖ్య, హిమన్షు ల పిక్స్ షేర్ చేస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Written By:
  • Publish Date - August 12, 2022 / 11:54 AM IST

Hyderabad: రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్టర్‌లో తన చిన్న నాటి జ్జాపకాలను పంచుకున్నారు. కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ చెల్లెలు కవితతో ఉన్న ఫొటోతో పాటు కూతురు అలేఖ్య, హిమన్షు ల పిక్స్ షేర్ చేస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కాగా, రాఖీ పౌర్ణమి సందర్భంగా బాన్సువాడలోని తన నివాసంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి తన సోదరి దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన అక్కాచెల్లెల్లతో రాఖీలు కట్టించుకున్నారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని సందడి చేశారు. మంత్రి హరీశ్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని, రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని హరీష్ రావ్ అన్నారు. రాష్ట్రంలో రాఖీ పండుగ జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.