MP Ys Avinash : సీబీఐ నోటిసులపై స్పందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇప్పుడు విచారణకు హాజరుకాలేనంటూ లేఖ
దివంగత మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈరోజు (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.
కాగా సీబీఐ పంపించిన నోటీసులపై అవినాశ్ రెడ్డి స్పందించారు.
దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని అయితే ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని సీబీఐకు లేఖ రాశారు.
నేడు పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేనని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఒక రోజు ముందుగా నోటీసు పంపారు ముందుగా అనేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకున్నాను.
5 రోజుల తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని తెలిపారు.
మరోసారి విచారణ తేదీ తెలియజేయాలని లేఖలో అవినాష్ కోరారు.
కాగా 2019 మార్చి 15న ఆయన ఇంట్లోని బాత్రూమ్‌లోనే వైఎస్ వివేకానంద రెడ్డిని దుండగులు దారుణంగా నరికి చంపారు.
2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
వివేకా హత్య కేసు నాటి నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది.
కోర్టు, కేసులు, దోషులు, సాక్షులు, సీబీఐ విచారణ, ఇతర రాష్ట్రాలకు కేసు బదలాయించడం ఇలా ఈ కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.
వివేకా హత్య రాజకీయపరం గానూ పెను సంచలనం సృష్టించింది.
వైఎస్ వివేకానందారెడ్డి కుమార్తె వైఎస్ సునీత అభ్యర్థన మేరకు కేసును సీబీఐకు హైకోర్టు అప్పగించింది.
అప్పటి నుంచి కేసు దర్యాప్తులో పలువురు నిందితులను అరెస్ట్ చేశారు.
తాజాగా వైఎస్ అవినాష్‌ను ఈ కేసులో విచారించనుంచడంతో సర్వత్రా ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.
మరి ఇప్పుడు అవినాశ్ రెడ్డి లేఖపై సీబీఐ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
కాగా వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం నాడు కడప, పులివెందులకు వెళ్లారు.
పులివెందుల వైసీపీ కార్యాలయానికి వెళ్లిన అధికారులు అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంతో పాటు తండ్రి భాస్కర్ ఇంట్లో సోదాలు జరిపారు.
అలాగే ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు వెనుదిరిగారు.
అనంతరం పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/