Site icon Prime9

Kerala: నీట్ పరీక్షనాడు విద్యార్దిని ఇన్నర్ వేర్ ను తొలగించమన్న సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి

Kerala: కేరళలోని కొల్లాంలో ఆదివారం జరిగిన నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ముందు తన కుమార్తె బ్రాను తొలగించమని ఒత్తిడి చేసారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పరీక్షా కేంద్రమైన మార్ థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వద్ద భద్రతా తనిఖీల్లో మెటల్ హుక్స్ బీప్ కావడంతో బాలికను తన బ్రాను తొలగించమని అడిగారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 90 శాతం మంది విద్యార్థినులు తమ ఇన్నర్‌ వేర్ లను తొలగించి స్టోర్‌రూమ్‌లో ఉంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. అయితే ఈ ఫిర్యాదు కల్పితమని పరీక్షాకేంద్రం సూపరింటెండెంట్ తెలిపారు. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఇటువంటి ఇన్నర్ వేర్ లను తొలగించే నిభందనలు లేవని పేర్కొంది.

 

Exit mobile version