Site icon Prime9

Actress Tapsee : తాప్సీ పై కేసు నమోదు చేసిన ఎమ్మెల్యే కొడుకు.. కారణం ఏంటంటే?

case filed on actress tapsee about her jewellery

case filed on actress tapsee about her jewellery

Actress Tapsee : ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంచి మనోజ్ హీరోగా నటించాడు. దాంతో తాప్సీ వరుసగా రవితేజ, ప్రభాస్, మంచు విష్ణు, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది. అయితే తెలుగులో ఈమె నటించిన సినిమాలలో ప్రభాస్ తో చేసిన మిస్టర్ పర్‌ఫెక్ట్ మాత్రమే హిట్ సాధించింది. తాప్పీ తెలుగులో తక్కువ సినిమాలే  చేస్తున్నప్పటికీ బాలీవుడ్ లో బిజీ గానే ఉంటోంది. తాజాగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 14న ముంబైలో నిర్వహించిన లాక్మే షోలో తాప్సీ పాల్గొంది. ఈ ఫ్యాషన్ షోలో ఈ అమ్మడి డ్రెస్ మరి శృతిమించి ఉంది. రెడ్ డ్రెస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఎద భాగం ఎక్కువగా కనిపించేలా స్కిన్ షో చేసింది. అటువంటి డ్రెస్సింగ్ స్టైల్ లో ఉండగా మేడలో పెద్ద లక్ష్మి దేవి ముద్ర ఉన్న హారాన్ని వేసుకొని ఫ్యాషన్ వాక్ చేసింది. ఇక అలాంటి డ్రెస్ లో తాప్సీ లక్ష్మి దేవి హారాన్ని వేసుకోవడం అందర్నీ ఇబ్బందికి గురి చేసింది. దీంతో మధ్యప్రదేశ్ కి చెందిన ఎమ్మెల్యే కొడుకు తాప్సీ పై పోలీస్ కేసు నమోదు చేశాడు.

మధ్యప్రదేశ్ ఇండోర్ లోని పోలీసులకు ఎమ్మెల్యే తనయుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నివేధిక ప్రకారం.. తాప్సీ అటువంటి డ్రెస్ లో లక్ష్మి దేవి హారాన్ని ధరించడమన్నది మా మనోభావాలను దెబ్బ తీసింది. ఆమె పై చర్యలు తీసుకోవాలంటూ పేర్కొన్నాడు. మరి దీని పై తాప్సి ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇక ఇటీవల కాలంలో సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన రష్మిక మందన్న తన డ్రెస్సింగ్ స్టైల్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి సైతం విసుగు తెప్పిస్తుంది. బాలీవుడ్ లోకి రాగానే మీ అందరికి ఏమవుతుంది అంటూ హిందీ ప్రేక్షకులే నిలదీశారు. అలాగే రాశి ఖన్నా డ్రెస్సింగ్ కూడా ఈ మధ్య శృతి మించుతోంది. ఈ నేపథ్యం లోనే ఎప్పుడో సౌత్ నుంచి నార్త్ కి చెక్కేసిన తాప్సీ పై ఏకంగా కేసు నమోదు అయ్యింది. కాగా తాప్సీ తెలుగు సినిమా ‘జుమ్మంది నాదం’తో వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెట్టిల్ అయ్యిపోయి, అక్కడ వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది.

Exit mobile version