Site icon Prime9

Sritej: యువతి ఫిర్యాదు – పుష్ప 2 నటుడిపై చీటింగ్‌ కేసు

Case on Actor Sritej: టాలీవుడ్‌ నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు నమోదైంది. అతడిపై ఓ యువతి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా ఇటీవల కాలంలో ఇండస్ట్రీ వ్యక్తులపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. కొద్ది రోజుల పాటు హీరో రాజ్ తరుణ్‌, లావణ్య కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. ఆ తర్వాత జానీ మాస్టర్‌పై మహిళా కొరియోగ్రాఫర్‌ ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో జానీ మాస్టర్‌ జైలుకు వెళ్లగా.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా నటుడు శ్రీ తేజ్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది.

పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేశాడంటూ ఓ యువతి కూకట్‌పల్లిలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై BNS 69, 115(2), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా గతంలోనూ శ్రీతేజ్‌పై ఇదే పీఎస్‌లో కేసు నమోదైంది. ఓ బ్యాంక్‌ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలిసి సదరు బ్యాంక్‌ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. దీనిపై మదాపూర్‌లో పరిధిలోని పీఎస్‌లో ఫిర్యాదు రాగా.. కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది.

ఇండస్ట్రీలో బడా హీరోల చిత్రాల్లో నటిస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా హీరోగా నటిస్తున్న శ్రీతేజ్‌ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడిపై వరుస కేసులు నమోదవ్వడం గమనార్హం. కాగా శ్రీతేజ్‌ ఇండస్ట్రలో వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం పాన్‌ ఇండియా, పెద్ద సినిమాల్లో సహాయక పాత్రలు పోషిస్తున్నాడు. అల్లు అర్జున్‌ పుష్ప 1, ధమకా, మంగళవారం, బహిష్కరణ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అతడు తాజాగా ‘పుష్ప 2’లోనూ నటించాడు.

Exit mobile version