Site icon Prime9

Hyderabad: పోలీసులు వాహనం ఆపారంటూ క్షణికావేశంలో వాహనానికి నిప్పు

Bike was set on fire as the police stopped the cart

Bike was set on fire as the police stopped the cart

Ameerpet: నగరంలో ట్రాఫిక్ సమస్య పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. నేతల అండదండలు, మామూళ్ల మత్తులో ప్రభుత్వ యంత్రాంగం తూలుతుండడంతో ట్రాఫిక్ కష్టాలు భాగ్యనగర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎటొచ్చి, సామాన్యుడు మాత్రం పోలీసులకు చిక్కి చలానాలు అందుకొంటున్నారు. తాజాగా రాంగ్ రూట్లో వస్తున్న ఓ వాహనదారుడిని పోలీసులు ఆపడంతో, క్షణికావేశంలో బైకు యజమానే వాహనానికి నిప్పు పెట్టిన ఘటన అమీర్ పేట వద్ద చోటుచేసుకొనింది.

సమాచారం మేరకు, సిగ్నల్ దాటి ఓ వాహనదారుడు అపసవ్య మార్గంలో వస్తున్నట్లు మైత్రివనం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు గుర్తించారు. వెంటనే అతన్ని ఆపి వాహన తాళాలు లాక్కొన్నారు. పక్కన ఉండాలంటూ ఆర్డర్ వేశారు. ఎవ్వరూ లేని సమయంలో పక్కనే ఉన్న దుకాణం వద్దకు వచ్చానని డ్యూటీ పోలీసును అర్జించాడు. అయితే ఒప్పుకోకపోవడంతో వాహన యజమాని క్షణికావేశంలో బండికి నిప్పు పెట్టేశాడు.

దీంతో పోలీసులు బిత్తరబోయి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడ్డారు. ఓ వాహనం దాటే క్రమంలో తాను కూడా ఆ బండి వెనకాలే వచ్చానని వాహనదారుడు పోలీసులతో మొత్తుకొన్నాడు. దీనికి పోలీసులు కరెక్ట్ కాదని వాదించారు. చివరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు అతన్ని పిఎస్ కు తరలించారు. ముందు వెళ్లుతున్న వాహనాన్ని అడ్డుకోలేక తనను ఆపారంటూ వాహనదారుడు వాపోయాడు.

ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు ప్రత్యేక రూలింగ్ సిస్టం తెస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే కొన్ని ప్రదేశాల్లో పోలీసుల తీరుతోనే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురౌతున్నాయి. జెఎన్టీయు వద్ద ఎదురుగా ఉన్న మార్గంలో చిరు వ్యాపారులు అధికంగా ఉంటారు. వారంత రోడ్డు మార్గాన్ని మూసివేసేలా ప్రవర్తిస్తున్నా, పోలీసులు పెద్దగా పట్టించుకోరు. ఓ సమోసా దుకాణ యజమాని రోజుకు రెండు వందల వరకు సమోసాలు ఎదురుగా ఉన్న పోలీసు స్టేషన్ కు పంపించాలి. ఇలా ఒకరేంటి రోడ్డు వైపున ఉన్న చిరు వ్యాపారులంతా రోజుకు రెండు వందల నుండి వెయ్యి రూపాయల వరకు పోలీసులకు సమర్పించుకోవాల్సిందే.

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ మార్గంలో రోడ్డుపైన డ్రైఫ్రూట్స్ అమ్మే వాహనాలు ట్రాఫిక్ కు అడ్డుపడుతూ తీవ్ర ఇబ్బందులు కల్గిస్తుంటాయి. అయినా వాటిని చూసి చూడకుండా పోలీసులు వ్యవహరించడానికి కారణం లంచమని ,చెప్పాల్సిందే. మరో వైపు అధికార నేతలు మా వాడు అంటూ రోడ్డును ఆక్రమిస్తున్న వారికి భరోసా…ఎటొచ్చి ప్రజలు, ద్విచక్ర వాహనదారులను పోలీసులు బెదిరిస్తూ డ్యూటీ చేస్తున్నామని డబ్బాలు కొట్టుకొంటుంటారు.

ఇది కూడా చదవండి: Hyderabad Traffic: నేటినుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్

Exit mobile version