Site icon Prime9

Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్

akhila priya

akhila priya

Akhila Priya: నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పెంచాయి. బహిరంగ కు చర్చకు రావాలంటూ.. ఎమ్మెల్యే శిల్పా రవికి భూమ అఖిల ప్రియ సవాల్ విసిరారు. దీంతో అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది.

అఖిల ప్రియ సంచలన ఆరోపణలు

నంద్యాల రాజకీయం రసకందాయంలో పడింది. మాజీ మంత్రి భూమా అఖిల వ్యాఖ్యలు.. వైరల్ గా మారాయి.

భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే శిల్పా రవి కుటుంబంపై చేసిన ఆరోపణలు.. రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపాయి.
ఇంతకు అఖిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా.? రాజకీయ క్రీడలో భాగంగా ఇలా ఆరోపణలు చేసారా అనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే శిల్ప కుటుంబం టీడీపీ వైపు చూస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వదిలేశారు. దీంతో వైసీపీ శిబిరంలో పెద్ద చర్చకు దారితీసింది.

ఇప్పటికే టీడీపీ నేతలతో శిల్పా ఫ్యామిలీ టచ్ ఉన్నారాని.. తెదేపా లో చేరడానికి ప్రయత్నిస్తూ ఆ పార్టీ నేతలను విమర్శిస్తే ఎలా అని అఖిల ప్రియ ప్రశ్నించారు.

చంద్రబాబును తిడితే పార్టీలో ఏ విధంగా చేర్చుకుంటారో చెప్పాలన్నారు.
నంద్యాల నియోజకవర్గంలో అవినీతి.. అక్రమాలపై చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా అఖిల ప్రియ సవాల్ విసిరారు.

నేడు సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ కు వస్తానని.. ఆధారాలతో సహా శిల్ప రవి చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా భూమ అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు.

 

అఖిల ప్రియ మైండ్ ఆడుతున్నారా..

మాజీ మంత్రి వ్యాఖ్యలతో వైసీపీ నేతలు అయోమయంలో పడింది. నిజంగానే శిల్పా రవి కుటుంబం టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దీంతో శిల్పా రవి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది.

భూమా అఖిల వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానం.. శిల్పా రవి పై ఆరాలు తీయడం ప్రారంభించిందని వైసీపీ నేతలు అంటున్నారు.

తాము టీడీపీ లోకి వెళ్లాల్సిన అవసరం లేదని శిల్పా రవి ప్రశ్నించారు.

దీంతో అఖిల ప్రియ మాటలకు.. ఎదురుదాడికి రవి సిద్ధమవుతున్నారు.

నంద్యాల కేంద్రంగా అఖిల ప్రియ ఇటీవల కార్యకలాపాలను తీవ్రం చేయడం కూడా.. చర్చకు దారి తీసింది.

నంద్యాలపై భూమా అఖిల కన్నేసారని.. అందులో భాగంగానే టార్గెట్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

భూమా అఖిల కూడా నంద్యాల లో తిరిగి పట్టు సాధించే పనిలో ఉన్నారట.

శిల్పా రవి తండ్రి మోహన్ రెడ్డి 2014 లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఒడిపోయారని, తిరిగి పచ్చ కండువా కప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారట.

అఖిల ప్రచారంతో శిల్పా రవి ఇరుకున పడుతున్నారట.

మొత్తమ్మీద శిల్పా రవి, భూమా అఖిల ఆరోపణలు, ప్రత్యారోపణలతో నంద్యాల రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar