Site icon Prime9

Ben Stokes: వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్

Ben Stokes: ఇంగ్లండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రపంచకప్ ట్రోఫీతో నిల్చున్న ఫొటోను షేర్ చేస్తూ తన రిటైర్మెంట్‌ను స్టోక్స్ ప్రకటించాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని, డుర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడతానని తెలిపాడు. ఇంగ్లండ్ కోసం సహచరులతో ఆడిన ప్రతి క్షణాన్ని తాను ప్రేమించానని చెప్పుకొచ్చాడు. ఈ మార్గంలో తాము అద్భుతమైన ప్రయాణం చేశామని స్టోక్స్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇకపై టెస్ట్ క్రికెట్‌కు చేయాల్సిందంతా చేస్తానని, వన్డేల నుంచి తప్పుకోవడం ద్వారా టీ20 ఫార్మాట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించగలుగుతానని చెప్పాడు. చివరి మ్యాచ్ ఆడబోతున్నానన్న ఫీలింగ్ గొప్పగా ఉందన్నాడు.

స్టోక్స్ ఇప్పటి వరకు 104 వన్డేలు ఆడి 39.44 సగటుతో 2వేల 919 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ తో ప్రపంచకప్ ఫైనల్‌లో 84 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గానూ నిలిచాడు. 2011లో ఐర్లండ్‌తో మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసిన స్టోక్స్. మొత్తంగా 2వేల 919 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 74 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన రాయల్ లండన్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టోక్స్ ఆ సిరీస్‌లో జట్టుకు 3-0తో అద్భుత విజయాన్ని అందించిపెట్టాడు. ప్రస్తుతం టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్టోక్స్. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి 3-0తో సిరీస్‌ను అందించాడు.

Exit mobile version