Hyderabad: యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన బండి సంజయ్ పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లెలో బండి సంజయ్‌కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా సంజయ్ అప్పిరెడ్డిపల్లెలో పైలాన్ ఆవిష్కరించారు. బీజేపీ శ్రేణులు బానా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
పాలకుర్తి మండలం దేవరుప్పులలో బీజేపీ, టీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య జరిగిన ఘర్షణతో బీజేపీ పై ప్రజల్లో సానుభూతి పెరిగింది. టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్ ఈ దాడి చేయించిందని బీజేపీ ఆరోపించింది. మరో పక్క కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాకూర్ కూడా ఈ దాడిని ఖండించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో పోలీసులు కూడా రౌడీల్లా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
పాదయాత్రలో మొదటి నుంచి బండి సంజయ్ కేసీఆర్‌ను టార్గెట్ చేసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యలో ఎండగట్టారు. అన్ని ప్రాంతాలు తిరుగుతూ అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రతీ విషయంలో ప్రభుత్వ తప్పిదాలను అక్కడి ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. బండి సంజయ్ ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే, రాష్ట్రంలో బీజేపీ మరింత బలంగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులంటున్నారు.