Bandi Sanjay Fire: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి.. ఉద్యోగాలు లేని యువత పరిస్థితి దారుణంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులు అందినంత దోచుకుంటున్నారని.. పేదవాళ్ల భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం కేవలం 22 నోటిఫికేషన్లు ఇచ్చి 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని.. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోనే 2.46 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు.
317 జీవో పేరుతో ఉద్యోగులను విభజించారని.. వారి ఇష్టం లేకున్నా బలవంతంగా పంపిస్తున్నారని తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చాక.. ఈ జీవోను సవరిస్తామని బండి సంజయ్ అన్నారు.
రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు మినహా మరే సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు.
తెలంగాణలో మద్యానికి ఉన్న విలువ.. ప్రభుత్వ ఉద్యోగులకు లేదని సంజయ్ అన్నారు. రాష్ట్రం ఏర్పాడ్డాక మద్యం ద్వారా ఏటా ఆదాయం రూ.10 వేలు కోట్లు ఉంటే.. నేడు రూ.40 వేల కోట్లు దాటిందని అన్నారు.
కేసీఆర్ రూ. 5 లక్షల కోట్లు అప్పు ఎలా చేశారో.. ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ఎలాంటి ఆలోచన లేకుండా అప్పులమీద అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని మండిపడ్డారు.
తెరాసకు మళ్లీ అధికారమిస్తే… మరో 5 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలను బికారీలను చేస్తారని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ నోటి నుండి ఏ దేశం పేరొచ్చినా ఆ దేశం అవుట్ అన్నారు. మొదట శ్రీలంక జీడీపీ బాగుందన్నారు.
అక్కడ అడుక్కుతింటున్నరు. తర్వాత పాకిస్తాన్ సూపర్ అన్నడు. గోధుమ పిండి కోసం తన్నుకుంటున్నరు.
చైనా గ్రేట్ అన్నడు.. కరోనాతో అల్లాడుతూ దిగజారిపోయింది.
దయచేసి భారత్ పేరును కేసీఆర్ ప్రస్తావించొద్దు… కేసీఆర్ నోరు మంచిది కాదు.. ఏది బాగుందని చెప్పినా… అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోందని బండి సంజయ్ ఛమత్కరించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి.
ఈసారి ఆదాయానికి మించి భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేయబోతున్నారు.
ఈ అంశాన్ని ప్రజల్లోకి వెళ్లి వివరించాలని భాజపా కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ నీచుడని.. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతటి నీచానికైనా పాల్పడతాడని సంజయ్ అన్నారు. కుటుంబాలను, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వెనుకాడరని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామన్నారు. పేదలకు ఇండ్లు కట్టిస్తామని.. పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/