Site icon Prime9

Ashu Reddy : రెండు రోజులుగా చాలా ఇబ్బంది ప‌డ్డాను అంటూ డ్రగ్స్ కేసుపై నోరు విప్పిన అషురెడ్డి..

ashu reddy responce over kp chowdary drugs case

ashu reddy responce over kp chowdary drugs case

Ashu Reddy : ఇంస్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది అషూ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ హోదా పొందింది ఈ భామ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ అందాలతో అభిమానుల్ని అలరిస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ కేసులో అధికారుల విచారణలో.. కేపీ చౌదరి పన్నెండు మంది డ్రగ్స్‌ పెడ్లర్స్‌, ఆరుగురు డ్రగ్స్‌ కన్‌స్యూమర్స్‌ పేర్లను చెప్పినట్టు తెలుస్తోంది. వాళ్లకు సంబంధించి మొత్తం డేటాను రిలీజ్‌ చేశారు పోలీసులు. ఈ లిస్ట్ లో రఘు తేజ పేరు కీలకం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా.. శ్వేత, సుశాంత్ రెడ్డి, నితినేష్‌, సనా మిశ్రా, శ్వేత, వంటేరు సవన్‌ రెడ్డి, ఠాగూర్‌ ప్రసాద్‌, చింతా రాకేష్‌, రోషన్‌ బెజవాడ భరత్‌, అతడి భార్య సాయిప్రసన్న పేర్లున్నాయి.

కాగా ఈ కేసులో వారికే కాకుండా నటీమణులు అషురెడ్డి, సురేఖవాణి, జ్యోతికి కూడా సంబంధాలు ఉన్నాయని పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. దీని పట్ల ఇప్పటికే సురేఖ వాణి స్పందించగా.. తాజాగా అషు రెడ్డి కూడా స్పందించింది. డ్రగ్స్‌ కేసుతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ వీడియోలో (Ashu Reddy) మాట్లాడుతూ.. ‘‘గత రెండు రోజులుగా నా చుట్టూ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కొన్ని ఛానెల్స్ ఆ విషయంలో నా నెంబర్‌ని ఓపెన్‌గా చూపించి ఇబ్బంది క‌లిగించారు. ఛానెల్స్‌లో చెబుతున్నట్లున్న కేసుకి నాకు ఎంత వ‌ర‌కు సంబంధం ఉంద‌నే విష‌యం గురించి నేను కూడా మాట్లాడ‌గ‌ల‌ను. ఎందుకంటే నా ద‌గ్గ‌ర కూడా ఆధారాలున్నాయి. వంద‌ల కాల్స్‌, గంట‌ల కొద్ది మాట్లాడాన‌ని చెప్పారు. అయితే నేను వాటిని రుజువు చేసుకునే హ‌క్కు నాకు కూడా ఉంది.

ఈ విష‌యంపై నేను స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. స‌ద‌రు ఛానెల్స్ చేసున్న ఆరోప‌ణ‌ల‌ను ఒప్పేసుకున్నా, ఇలాంటి వీడియో రిలీజ్ చేయ‌కుండా సైలెంట్‌గా ఉందామ‌నుకున్నా బ‌య‌ట‌కు వచ్చిన న్యూస్‌ల‌కు చాలా మాన‌సిక వేద‌న‌ను అనుభ‌వించాను. నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని ఛానెల్స్ అయితే నోటికొచ్చిన‌ట్లు మాట్లాడాయి. కాబ‌ట్టి క‌చ్చితంగా నేను వారిపై ప‌రువు న‌ష్టం కేసు వేస్తాను. మీరు నా నెంబ‌ర్‌ను ఓపెన్‌గా చూపించ‌టం వ‌ల్ల ప్ర‌తీ సెక‌నుకి ఓ కాల్ వ‌స్తుంది. రెండు రోజులుగా చాలా ఇబ్బంది ప‌డ్డాను. ఇక‌పై ఈ నెంబ‌ర్‌ను ఉప‌యోగించాల‌నుకోవ‌టం లేదు. ఈ ఇష్యూ జ‌రిగిన‌ప్పుడు నేను వేరే దేశంలో ఉన్నాను. నాకెలాంటి సంబంధం లేదు. క‌చ్చితంగా దీని గురించి ఇంకా మాట్లాడుతాను’’ అన్నారు.

 

Exit mobile version