Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహారం, జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తినటం, పిల్లల్ని కనడం అడవిలో జంతువులు కూడా చేస్తాయన్నారు. కానీ ఇది సభ్య సమాజంలో నివసించే మనుష్యులకు వర్తించదని అన్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.
భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షులు ఒవైసీ ఘటుగా స్పందించారు. మోహన్ భగవత్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని అన్న ఒవైసీ భగవత్ కుసంస్కారిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సరోగసీపై సరైనా చట్టాలు లేవని, మోడీ హయాంలో పిల్లలు తాగాల్సిన తల్లిపాలు కూడా అమ్ముకుంటున్నారని ఒవైసీ ఆరోపించారు.
8 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. జనాభా పెరుగుదలపై భగవత్ ఓ వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగం పెరిగిపోవడంతో యువత రోడ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. సరిహద్దుల్లో చైనా ఆగడాలను మోడీ అడ్డుకోలేకపోతున్నారని విమర్శించారు.