Site icon Prime9

 Prakasham Barrage: దుర్గమ్మ తెప్పోత్సవం లేనట్లే…

As if there is no Durgamma Teppotsavam

As if there is no Durgamma Teppotsavam

Durgamma: దశరా శరన్నవ రాత్రుల్లో విజయవాడలో ఘనంగా చేపట్టే దుర్గ మల్లేశ్వర స్వామి నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. ప్రకాశం బ్యారేజ్ కి ఎగువనున్న పులిచింతల ప్రాజెక్ట్ నుండి నీరు వస్తుండడంతో ఈమేరకు నిర్వాహక కమిటి ఈమేరకు నిర్ణయం తీసుకొనింది. కృష్ణానదిలో స్వామి వారిని హంస వాహనంపై విహరింప చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే తెప్పోత్సవానికి జలవనరుల శాఖ నుండి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. నేటి సాయంత్రం వరకు ఇన్ ఫ్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గకపోవడంతో జలవనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.

నీరు తగ్గాలంటే పులిచింతల వద్ద రెండు రోజుల ముందస్తుగానే గేట్లు మూయాల్సి ఉంటుంది. కాని పైన నుండి ఎగువ నీరు వస్తుండడం వల్ల సాధ్యం కాని పనిగా మారింది. దీంతో పరిస్ధితులు అనుకూలంగా లేకపోవడంతో తెప్పోత్సవాన్ని నిర్వహించలేమని ఉత్సవాల సమన్వయ కమిటి నిర్ణయించింది.

గత ఏడాది కూడా ఇదే విధంగా పైనుండి నీరు రావడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. మొత్తం మీద కన్నుల పండువుగా సాగాల్సిన తెప్పోత్సవం ఎగువ నీటితో భక్తులకు నిరాశను కల్గించింది.

ఇది కూడా చదవండి:Bathukamma : తొమ్మిదొవ రోజు సద్దుల బతుకమ్మ

Exit mobile version