Site icon Prime9

AR Rahman: కడప దర్గాను సందర్శించిన ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఏఆర్‌ రెహమాన్‌ – ఫోటోలు వైరల్‌

AR Rahman Visit Kadapa Dargah

AR Rahman Visits Kadapa Dargah: ఆస్కార్‌ అవార్డు గ్రహిత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కడపలో సందడి చేశారు. అక్కడ ఘనంగా జరుగుతున్న అమీన్‌ పీర్‌ పెద్ద దర్గా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ దర్గా ప్రతి ఏడాది అమీన్‌ పీర్‌ పెద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతీ ఏటా ఏఆర్‌ రెహమాన్‌ ఈ వేడుకల్లో కుటుంబంతో సహా పాల్గొంటారు.

ఈ ఏడాది కూడా ఆయన కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని, గ్రంధ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఈ ఉత్సవాల్లో ప్ర‌ధాన‌మైన గంధ మహోత్సవం క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. దర్గా పీఠాధిపతి తన శిష్యగణంతో కలిసి కలశాన్ని తీసుకువచ్చారు. ప్రతియేటా అత్యంత వైభవంగా నిర్వ‌హించే ఈ కార్య‌క్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అదే విధంగా ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు(నవంబర్‌ 18) జాతీయ ముషాయి గజల్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గజల్‌ గాయకుల పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు రేపు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనన్నారని సమాచారం.

Exit mobile version