Minister Roja : తారకరత్నకు గుండెపోటు వస్తే నారా లోకేష్ పట్టించుకోలేదని మంత్రి రోజా విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రోజా కీలక కామెంట్స్ చేశారు.
విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో మంత్రి రోజా పాల్గొన్నారు.
అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ పెద్ద ఐరన్ లెగ్.. లోకేష్ ఎక్కడ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
తారకరత్న అస్వస్థతకు గురైతే చంద్రబాబు, లోకేష్ పట్టించుకోలేదు.
లోకేష్ అడుగుపెట్టాడు.. రాజమండ్రి పుష్కరాల్లో జనం చనిపోయారు.
లోకేష్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే మరకొందరు చనిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సైకో అయితే.. నారా లోకేష్ ఐరన్ లెగ్ సైకో అంటూ విరుచుకుపడ్డారు..
మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు.
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే.. వాళ్ల నాన్న చంద్రబాబుకి ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయి.
మొన్న పాదయాత్ర పోస్టర్ లాంచింగ్ చేస్తే 8 మంది చనిపోయారు.. నిన్న పాదయాత్ర చేస్తే నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చిదంటూ వ్యాఖ్యానించారు.
ఇక, లోకేష్ లాంటి ఐరన్ లెగ్ రాష్ట్రం అంతా నడిస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రజలు భయపడిపోతున్నారని చెప్పుకొచ్చారు మంత్రి రోజా.
లోకేష్ పాండిత్యాన్ని చూసి ఆయన పులకేసి అని అనాలని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారని… రోడ్డు మీదకు వచ్చింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో కొంతమంది అని మండిపడ్డారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వైఎస్ జగన్.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్‌పై మాట్లాడే అర్హత ఏ కోణంలో చూసినా లోకేష్ కు లేదన్నారు.
తన తండ్రిని అభిమానించే వాళ్ల కష్టాలు వినేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్.. వారి సమస్యలను తెలుసుకుని, తీర్చారని తెలిపారు.
దొంగదారిలో తన తండ్రి కేబినెట్‌లో మంత్రి అయిన లోకేష్… వాళ్ల నాన్నకు సంబంధంలేనివి కూడా ఆయనే నిర్మించారని చెబుతారంటూ ఫైర్ అయ్యారు..
తండ్రి చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి తీసుకుని లోకేష్ ఏం చేశారు అని ఫైర్ అయ్యారు.
మహిళలను కించపరిచే తండ్రి, కొడుకులకు .. మహిళల గురించే మాట్లాడే అర్హత లేదని రోజా వ్యాఖ్యానించారు.
తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు భద్రత పెరిగిందని అన్నారు.
ప్రస్తుతం రోజా చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
చూడాలి మరి రోజా వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ళు, నేతలు ఎలా స్పందిస్తారో అని
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/