Site icon Prime9

Tirumala: తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత

chirutha

chirutha

Tirumala: తిరుమలలో మరో చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతను ట్రాప్‌ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు నాలుగు చిరుతలను బంధించారు. తొలుత ఒక చిరుతను ట్రాప్‌ చేయగా.. ఆ తర్వాత రెండు, ఇప్పుడు మరొకటి బోనులో చిక్కాయి.

డీఎన్ఏ పరీక్షలు..(Tirumala)

అలిపిరి కాలినడక మార్గంలో ఆదివారం రాత్రి బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫీసర్‌ నాగేశ్వరరావు తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జూ క్వారంటైన్‌లో ఇటీవల పట్టుబడిన 2 చిరుతలున్నాయని.. బాలిక లక్షితపై దాడి చేసింది ఏ చిరుత అనేది ఇంకా తేలలేదని నాగేశ్వరరావు చెప్పారు. ఏ చిరుత దాడి చేసిందో వైద్య పరీక్షల నివేదికలో తెలుస్తుందన్నారు. వన్య ప్రాణుల జాడల కోసం 300 కెమెరాలతో నిరంతరం అన్వేషణను కొనసాగిస్తున్నామని తెలిపారు. కాలిబాటలో శాశ్వతంగా 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వన్య ప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు.

Exit mobile version