Site icon Prime9

Ram Gopal Varma: ఏపీలో కేసు – విచారణకు రావాలంటూ హైదరాబాద్‌లో పోలీసు నోటీసులు

Police Notice to Director Ram Gopal Varma: డైరెక్టర్‌ రాజమౌళికి పోలీసులు నోటీసులు అందాయి. ఈనెల 19న విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఓంగోలు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో రామ్‌ గోపాల్‌ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వ్యూహం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏపీ ఎన్నికల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఐటీ యాక్ట్‌ కింది ఆర్జీవీపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఆర్జీవీ విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. అయితే వీటిని స్వయంగా ఆయనకు ఇచ్చేందుకు నవంబర్‌ 13న ఉదయం హైదరాబాద్‌ వచ్చిన ఒంగోలు పోలీసులు ఆర్జీవీని తన ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నోటీసులు ఇచ్చి ఈనెల 19న ఒంగోలు రూరల్‌ సర్కిల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని తెలిపారు. ఆర్జీవికి ఒంగోలు ఎస్సై శివరామయ్య నోటీసులు అందించిన ఫోటోల ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Exit mobile version