Site icon Prime9

Ambati Rambabu : చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన వైకాపా మంత్రి అంబటి రాంబాబు..

ambati rambabu shocking comments on tdp chief chandrababu naidu

ambati rambabu shocking comments on tdp chief chandrababu naidu

Ambati Rambabu : తెదేపా అధినేత చంద్రబాబు ఒక ముసలి సైకో అని.. అధికారం లేకపోతే ఆయన బతకలేడని వైకాపా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఫైర్ అయ్యారు అంబటి.  ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సత్తెనపల్లిలో చంద్రబాబు చేసిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం అట్టర్ ప్లాప్ షో అని తేల్చేశారు. జనం రాకపోయిన మహా అద్భుతం అని అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తాడని.. తిట్టిన వారిపై కూడా ప్రశంసలు కురిపిస్తారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు జగన్ ని దూషించడం తప్ప ఒక్క నిజమైనా చెప్పాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని ముని శాపం ఉందని వైఎస్సార్ గతంలో‌ చెప్పాడని గుర్తు చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు రూ. 2 లక్షల కోట్లు ఇచ్చారని అన్నారు. కోడెల శివప్రసాద్ మరణానికి తాను కారణమని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కోడెల శివప్రసాద్ ఉరి వేసుకుని ఆత్మహత్య వేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. కోడెల శివప్రసాద్‌ తమ రాజకీయ ప్రత్యర్థి అని.. అనేక ఆరోపణలు వచ్చాయని, ప్రజలు ఫిర్యాదులు చేశారని.. వాటిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని.. కానీ అదేమైనా అరాచకమా? వేధింపులా? అని ప్రశ్నించారు. ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం కంటే అబద్దం మరొకటి లేదన్నారు.

కోడెల శివప్రసాద్‌ కేసులు పెట్టినందుకు చనిపోలేదని.. తాము కేసులు పెట్టినా టీడీపీ నుంచి ఆదరణ లేదని,, బాబు పట్టించుకోలేదని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కోడెల మృతికి చంద్రబాబే కారణం అని అంబటి వ్యాఖ్యానించారు. కోడెల శివప్రసాద్ మత్తు మాత్రలు మింగి ప్రాణాలు తీసుకోవాలని చూసినప్పుడు.. కంటే ముందు చంద్రబాబు ఆయనను పరామర్శించేందుకు కూడా ఇష్టపడలేదని ఆరోపించారు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్‌ స్వర్గస్తులు అయినారని ఆయనపై ప్రస్తుతం తాను విమర్శలు చేయదలుచుకోవడం లేదని అన్నారు. అలాంటి అంశాలు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతానని చెప్పారు.

కోడెల కుటుంబానికి ద్రోహం చేసింది చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు.. సత్తెనపల్లి వచ్చి తనపై విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఆంబోతులకు ఆవులను సరఫరా చేయడమేనని విమర్శించారు. తెలుగుదేశం వాళ్లకు కూడా అన్యాయం జరగకూడదని అనుకునే వ్యక్తిని తానని చెప్పారు. తన తమ్ముడు కనిపించడం లేదని చంద్రబాబు విమర్శించారని.. అయితే వాళ్లు ఎన్నికల సమయంలో తన తరఫున ప్రచారం చేశారని, మళ్లీ చేస్తారని చెప్పారు. తన గుండెమీద చేయి వేసుకొని చెబుతున్నా.. తాను ఎవ్వరికి అన్యాయం చేయలేదన్నారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే ఊరూరు తిరుగుతున్నాడని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

Exit mobile version