Chiranjeevi: మెగాస్టార్ చిరంజీతో అల్లు అర్జున్ దంపతులు – ఫోటో వైరల్

  • Written By:
  • Updated On - December 15, 2024 / 02:58 PM IST

Allu Arjun With Chiranjeevi: ఐకాన్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో కలిసి అల్లు అర్జున్ స్నేహలు ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుతుంది.  కాగా కాసేపటి క్రితం అల్లు అర్జున్‌ భార్య, పిల్లలతో కలిసి చిరంజీవిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సంగతి తెలిసింది. బన్నీతో పాటు ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌ కూడా వెళ్లారు. అక్కడ కాసేపు ముచ్చటిచుకున్నారు. సంధ్య థియేటర్‌ ఘటన, అరెస్ట్‌పై చిరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలిసి లంచ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బన్నీ చిరుతో కలిసి అప్యాయంగా ఫోటో తీసుకున్నారు. ఇది మెగా-అల్లు అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

కాగా సంధ్య థియేటర్‌ ఘటనపై అల్లు అర్జున్‌ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసుల అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్‌ అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్‌ ముందు బన్నీని హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు శుక్రవారం 5 గంటలకు ఆయనను చంచల్‌గూడ్‌ జైలుకు తరలించారు. అప్పటికే అల్లు అర్జున్‌ క్వాష్‌ పటిషన్‌ను విచారించిన హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ పేపర్స్ సిద్ధం చేసేందుకు ఆలస్యం అవ్వడంతో ఆ రోజు రాత్రి అల్లు అర్జున్‌ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఇక తెల్లారి ఉదయం 7 గంటలకు బెయిల్‌ పేపర్‌ అందడంతో శనివారం ఆయనను విడుదల చేశారు.