Site icon Prime9

Pushpa 2: ‘పుష్ప 2’ రన్ టైం ఎంతో తెలుసా? – తగ్గేదే లే అంటున్న మూవీ టీం!

Pushpa 2 Run time

Pushp 2 The Rule Run Time Lock: ప్రస్తుతం ‘పుష్ప 2’ టీం తగ్గేదే లే అంటూ ప్రమోషన్స్ సినిమాను ప్రమోట్‌ చేస్తుంది. దేశంలో ప్రధాన నగరాలే టార్గెట్‌గా ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ కండక్ట్‌ చేస్తోంది. దీంతో ఎక్కడ చూసిన పుష్ప మేనియా కనిపిస్తోంది. దానికి తగ్గేల ఫస్ట్‌ పార్ట్ ఫైర్‌ అయితే పుష్ప 2 వైల్డ్‌ ఫైర్ అని చెబుతుంది మూవీ టీం. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ నెక్ట్స్‌ లెవన్‌ అనిపించేలా ఉన్నాయి. సుకుమార్‌ కూడా అంచనాలను పెంచేలా ప్రతి ఫ్రేంను చెక్కుతున్నాడు. ఏదేమైనా ఈసారి ఆడియన్స్‌కి మాస్ జాతర చూపించాల్సిందేనని తగ్గేదే లే అంటున్నాడట. ఇందుకోస మూవీపై మరింత స్పెషల్‌ కేర్ తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం సుక్కు ఫైనల్‌ అవుట్‌పుట్‌ను చెక్కే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో మూవీ 3:30 గంటల భారీ రన్‌టైం వచ్చిందట. ఇక దానిని చెక్కుతూ చెక్కుతూ 3:15 నిమిషాలకు తీసుకువచ్చారట. ఫైనల్‌గా పుష్ప 2 రన్‌టైం 3 గంటల 15 నిమిషాలు లాక్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలు మినిమమ్‌ 3 గంటల రన్‌ టైం ఉంటున్నాయి. అలాంటిది ఎంతో క్రేజ్‌ ఉన్న పుష్ప 2కి మరో 15 నిమిషాల అదనపు రన్‌టైం పెద్ద విషయం కాదంటున్నారు మూవీ లవర్స్. సాధారణం ఆడియన్స్‌ని 2:30 గంటల వరకు కూర్చోబెట్టడమే కష్టం.

అలాంటిది 3:15 గంటలు సీట్లో కూర్చోబెట్టడమంటే చిన్న విషయం కాదు. ఇది టీంకి పెద్ద సవాలే అని చెప్పాలి. బోర్ కొట్టించని స్క్రీన్‌ప్లే, వావ్‌ అనిపించే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ అన్ని ఒకదాని మించి ఒకటి ఉండాలి. ముఖ్యంగా ఇంటర్వెల్‌తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచాలి. ఆ తర్వాత స్క్రీన్‌ నుంచి తల తిప్పలేని ఆసక్తికర కంటెస్టెంట్‌, సీన్స్‌ పెట్టాలి. సుకుమార్‌ సినిమాలంటే ఇలాంటి సన్నివేశాలకు కొదవే ఉండదు. ప్రతి సీన్ గూస్‌బంప్స్‌, నెక్ట్స్‌ లెవల్లో ఉంటాయి. ఇక పుష్ప 2 అయితే అంతకుమించి ఉంటుందని మూవీ టీం చెబుతూనే వస్తుంది. అలాగే ఇప్పటికి వరకు వచ్చిన ప్రమోషనల్‌ పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఇందులో సీన్స్‌ అన్ని కూడా గూస్‌బంప్స్‌ అనిపించేలా ఉన్నాయి.

కాబట్టి పుష్ప: ది రూల్‌కి ఆ మాత్రం రన్‌ టైం ఉండాల్సిందే అంటున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఆ రోజు వరల్డ్ బాక్సాఫీసు వద్ద పుష్ప 2 మాస్‌ జాతర కనిపించేలా ఉందనిపిస్తోంది. మూవీ అడ్వాన్స్‌ బుక్కింగ్స్ చూస్తుంటే ఫస్ట్‌ డే 200 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసే అవకాశం ఉందటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. లేదంటూ ఇప్పటి వరకు ఆర్‌ఆర్ఆర్‌ సినిమాపై ఉన్న 223 కోట్ల రికార్డును పుష్ప 2 తుడిచిపెట్టేలా కనిపిస్తుందని సినీ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. మరి డిసెంబర్‌ 5న పుష్ప 2 ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version