Site icon Prime9

Pushpa 2: ‘పుష్ప 2’ ఆల్‌టైం రికార్డ్‌ – ట్రైలర్‌తోనే మహేష్‌, ప్రభాస్‌లను వెనక్కి నెట్టిన బన్నీ

Pushpa 2 Telugu Trailer Record Views: ఊహించినట్టుగానే ‘పుష్ప 2’ మూవీ రికార్డుల వేట మొదలుపెట్టింది. నిన్న ట్రైలర్‌ లాంచ్‌తో విపరీతమైన బజ్‌ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలకు ముందే రేర్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంతో ‘పుష్ప: ది రూల్‌’ రూపొందిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. 2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచని పుష్ప: ది రైజ్‌కి ఇది సీక్వెల్‌ అనే విషయం తెలిసింది.

ఫస్ట్‌ పార్ట్‌ భారీ విజయంతో సెకండ్‌ పార్ట్‌పై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దానికి తోడు ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చాడు డైరెక్టర్‌ సుకుమార్‌. నిన్న బిహార్‌లోని పాట్నాలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను భారీగా ప్లాన్‌ చేసి విడుదల చేశారు. ఫ్యాన్స్‌ వెయిటింగ్‌కు ట్రైలర్‌తో ట్రీట్‌ ఫిస్ట్‌ ఇచ్చారు. వైల్డ్‌ ఫైర్‌గా సాగిన ట్రైలర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంది.

దీంతో పుష్ప 2 ట్రైలర్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తుంది. విడుదలైన క్షణాల్లోనే రికార్డు వ్యూస్‌ సాధించింది. కేవలం నిమిషాల వ్యవధిలో పుష్ప 2 ట్రైలర్‌ మిలియన్‌ వ్యస్‌ క్రాస్‌ చేసింది. ఈ క్రమంలో ట్రైలర్‌ సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. గంటల వ్యవధిలో అత్యథిక మిలియన్ల వ్యూస్‌ సాధించిన తొలి తెలుగు ట్రైలర్‌గా పుష్ప 2 ట్రైలర్‌ నిలిచింది. కేవలం 15 గంటల్లోనే ట్రైలర్‌ 42 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. దీంతో గతంలో ఈ రికార్డు ఉన్న మహేష్‌ బాబు, ప్రభాస్‌ చిత్రాలను సైతం వెనక్కి నెట్టింది. ఇప్పటి వరకు తెలుగులో విడుదలైన ట్రైలర్‌లో ఎక్కువ మంది చూసింది మహేష్‌ బాబు గుంటూరు కారం ట్రైలర్‌.

విడుదలైన 24 గంటల్లో ఈ ట్రైలర్‌ని 37.68 మిలియన్లకు పైగా వీక్షించారు. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్‌ సలార్‌ ట్రైలర్‌ నిలిచింది. 24 గంటల్లో ఈ ట్రైలర్‌ 32.58 మిలియన్ల వ్యూస్‌ అందుకుంది. ఇప్పుడు ఈ రెండు రికార్డులను పుష్ప 2 ట్రైలర్‌ కేవలం 15 గంటలోపే బీట్‌ చేసింది. కేవలం 15 గంటల్లోనే ఈ ట్రైలర్‌ 42 మిలియన్లకు పైగా వ్యూస్‌ రాబట్టి ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ప్రకటిచింది. సౌత్‌ ఇండియాలోనే రికార్డు వ్యూస్‌ సాధించిన తొలి ట్రైలర్‌గా పుష్ప 2 ట్రైలర్‌ నిలిచిందంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగిరేస్తున్నారు. జస్ట్‌ ట్రైలర్‌తోనే రికార్డ్స్‌ బ్రేక్‌ చేసిన పుష్ప 2 ఇక రిలీజ్‌ తర్వాత ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Exit mobile version