Site icon Prime9

Pushpa 2: హైదరాబాద్‌లోనే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ – చీఫ్‌ గెస్ట్‌గా వచ్చేది ఎవరంటే..!

Pushpa 2 Pre Release Event: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ రిలీజ్‌కు అంతా సిద్ధమవుతుంది. రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులే ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బ్రందం ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తుంది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీం దేశమంతా చూట్టేస్తుంది. బీహార్‌ పాట్నాలో ట్రైలర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ తర్వాత కిస్సిక్‌ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ చెన్నైలో, మొన్న కొచ్చిలో ప్రమోషనల్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇవాళ శుక్రవారం (నవంబర్‌ 29) ముంబైలో ప్రెస్‌మీట్‌ జరగనుంది.

ఇప్పటికే అల్లు అర్జున్‌, రష్మిక, మేకర్స్‌ ముంబైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పుష్ప 2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎక్కడ జరగనుందనేది అందరిలో సందేహం నెలకొంది. ఎందుకంటే దేవర మూవీ టైంలో జరిగిన గందరగోళం వల్ల హైదరాబాద్‌లో ఈవెంట్‌కి అనుమతి దొరకుతుందా? లేదా? సందేహం నెలకొంది. దీంతో నార్త్‌ స్టేట్స్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తాజా అప్‌డేట్‌తో తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది.

అయితే ఇప్పటి వరకు వేదిక ఏదనేది మాత్రం ఫిక్స్‌ కాలేదు. ఎప్పటిలాకే యూసఫ్‌ గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించాలని అనుకున్నారు. ఆ విధంగా మేకర్స్‌ ప్లాన్‌ చేశారు కూడా. కానీ దేవర టైంలో జరిగిన గందరగోళం వల్ల ఈవెంట్‌కి పర్మిషన్‌ వస్తుందా? లేదా? అనే చర్చ జరిగింది. సందేహించినట్టుగానే ఈవెంట్‌ ప్లేస్‌ మారిందట. యూసఫ్‌ గూడ గ్రౌండ్‌ నుంచి మల్లారెడ్డి కాలేజీ వేదిక ఛేంజ్‌ అయ్యిందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికి మల్లారెడ్డి కాలేజీ ఫిక్స్‌ అయినట్టు సినీవర్గాలు అంటున్నాయి. ఇవాళ ముంబై ప్రెస్‌మీట్‌ తర్వాత పుష్ప టీం ఆ తర్వాత రేపు(నవంబర్‌ 30) చిత్తూరులో ఈవెంట్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.

ఆదివారం డిసెంబర్‌ 1న ప్రీ రిలీజ్‌ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీ జరిగే అవకాశం ఉందట. ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన పుష్ప 2కి సంబంధించి ఎలాంటి ఈవెంట్‌కు హాజరుకాలేదు. ఈ క్రమంలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. వాటన్నింటికి చెక్ పట్టేందుకు సుక్కుమార్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేయనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా రానున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, పవన్‌ కళ్యాణ్‌ రానున్నారంటూ సోషల్‌ మీడియాలో మాత్రం చర్చ జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Exit mobile version