Site icon Prime9

Pushpa 2 Trailer: ‘ఎవడ్రా వాడు.. డబ్బు అంటే లెక్క లేదు.. పవర్ అంటే భయం లేదు’- గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న పుష్ప 2 ట్రైలర్‌

Pushpa 2 Official Trailer Out: ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ తెర పడింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా మూవీ టీం పుష్ప 2 ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. కాగా ఇండియన్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రంగా ‘పుష్ప: ది రూల్‌’ నిలిచిందనడంలో సందేహమే లేదు. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన ‘పుష్ప: ది రైట్‌’కి ఇది సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అల్లు అర్జున్‌ పర్ఫామెన్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. పుష్పరాజ్‌గా ఆయన బాడీ లాంగ్వేజ్, మ్యానరిజంకు థియేటర్లో ఈళలు పడ్డాయి. ఇక పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో సెకండ్‌ పార్ట్‌ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ ఎట్టకేలకు 2024 డిసెంబర్‌ 5న విడుదలకు సిద్ధమవుతుంది.

ఇంకా రిలీజ్‌కు కొన్ని రోజులే ఉండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో నేడు ట్రైలర్‌ లాంచ్‌కి ముహుర్తం ఫిక్స్‌ చేసింది. తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పుష్ప 2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని భారీగా ప్లాన్‌ చేశారు. దీనికి ఉత్తర భారతదేశంలో బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌ వేదికైంది. అక్కడ భారీ ఎత్తున ‘పుష్ప 2’ ట్రైలర్‌ రిలీజ్‌కు మూవీ టీం ప్లాన్‌ చేసింది. నేడు (నవంబర్‌ 17) సాయంత్రం 6:03 నిమిషాలకు ట్రైలర్‌ రిలీజ్‌కు టైం ఫిక్స్ చేసినట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. చెప్పినట్టుగానే పుష్ప 2 ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు మించి ఈ ట్రైలర్‌ ఉంది. ఇంతకాలం వెయిటింగ్‌కి సుకుమార్‌ టీం ట్రైలర్‌తో మంచి ట్రీట్‌ ఇచ్చారు. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌తో పుష్ప 2 ట్రైలర్‌ సాగింది.

‘ఎవడ్రా వీడు డబ్బు అంటే లెక్క లేదు.. పవర్ అంటే భయం లేదు’ అంటూ జగపతి బాబు డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత పుష్ప పేరు చిన్నగా ఉన్నా.. పేరు చెబితే సౌండ్ మాత్రం మారుమోగిపోద్ది అని హిందీ డైలాగ్ యాడ్ చేశారు. ఆ తర్వాత ‘పుష్ప అంటే పేరు అనుకుంటివా? బ్రాండ్’ అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తానికి అవుట్ అండ్ అవుట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో ట్రైలర్‌ సాగింది. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో నవీన్‌ యర్నేనీ, యలమంచిలి రవి శంకర్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో మలయాళ స్టార్‌ నటుడు ఫహాద్‌ ఫాజిల్ భన్వర్‌ సింగ్‌గా పోలీసు పాత్ర పోషించగా.. జగపతి బాబు, అనసూయ, సునీల్‌, రావు రమేష్‌తో పాటు ఇతర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు.

Exit mobile version