Site icon Prime9

Pushpa 2 Ticket Rates: భారీగా ‘పుష్ప 2’ టికెట్‌ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ – టికెట్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే

Pushpa 2 Ticket Rates Hiked: ‘పుష్ప 2’ టికెట్‌ ధరల భారీ పెంపునకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు టికెట్‌ ధరల పెంపును నిర్ణయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరో సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్‌ వైయిటెడ్‌ మూవీ ‘పుష్ప 2’. డిసెంబర్‌ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా పుష్ప 2 మూవీ టికెట్‌ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

అదేవిధంగా బెనిఫిట్‌ షోలకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం టికెట్‌ ధరలు, బెనిఫిట్‌ షోలకు టికెట్‌ ధరల రేట్లను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 4న రాత్రి 9:30 గంటల బెనిఫిట్‌ షోతో పాటు అర్థరాత్రి 1 గంటల షోకు కూడా అనుమతి ఇచ్చింది. అలాగే అర్థరా్తరి 1 గంటల నుంచి తెల్లావారుజాము 4 గంటల అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. ఇక బెనిఫిట్‌ షోల టికెట్‌ ధర రూ. 800లుగా ఖరారు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైన సింగిల్‌ స్క్రీన్స్‌లో టికెట్‌ ధర 800లుగా నిర్ణయించారు. ఇక డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 150, మల్టీప్లెక్స్‌లో రూ.200లుగా టికెట్‌ ధరలను పెంచారు. ఇక డిసెంబర్‌ 9 నుంచి 15 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 105, మల్టీప్లెక్స్‌ లో రూ.150, ఇక డిసెంబర్‌ 17 నుంచి 23 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.20, మల్టీప్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నో అంచనాల పుష్ప 2 భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12000 స్క్రీన్స్‌లో మూవీ విడుదల అవుతుంది. అత్యధిక థియేటర్లలో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రమిదే ఇప్పటికే మూవీ టీం పేర్కొంది.

Exit mobile version