Site icon Prime9

Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌ ప్రోమో చూశారా – దేవిశ్రీ ప్రసాద్‌ కుమ్మేసాడంతే..

Watch Pushpa 2 Sreeleela Song Promo: అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రూల్‌’ రిలీజ్‌ టైం దగ్గరపడుతుండటంతో మూవీ టీం అప్‌డేట్స్‌తో అభిమానులకు ట్రీట్‌ ఇస్తుంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌తో సినిమాపై విపరీతమైన బజ్‌ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ అప్‌డేట్‌ ఇచ్చి మరింత బజ్‌ క్రియేట్‌ చేశారు. రేపు కిస్సిక్‌ సాంగ్‌ (Kissik Full Song) విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ ఈ సాంగ్‌ ప్రొమో విడుదల చేశారు. 17 సెకండ్ల నిడివి ఉన్న ఈ ప్రోమో కిస్ కిస్ కిస్ కిసిక్.. కిస్సా కిస్సా కిసిక్.. అంటూ సాగింది. ఈ ప్రోమో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో కుమ్మేసిందనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన ఈ స్కోర్ థియేటర్‌లో మోతమోగిపోయేలా ఉంది. ఈ ప్రోమో చూసిన వారంత ఫుల్‌ సాంగ్ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. రేపు సాయంత్రం 7:02 నిమిషాలకు కిస్సిక్ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. కాగా పుష్ప 2 డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది.

Exit mobile version