Site icon Prime9

Allu Arjun : “పుష్ప 2” కోసం జిమ్ లో తెగ కష్టపడిపోతున్న బన్నీ.. వైరల్ గా మారిన వీడియో

allu arjun gym work outs video goes viral on media

allu arjun gym work outs video goes viral on media

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “. 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కి దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ దాదాపు 350 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఈ పార్ట్ ని తగ్గేదే లే అనే రేంజ్ లో నిర్మిస్తున్నారు.

పుష్ప ది రూల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న రెండో భాగం నుంచి ఇటీవల ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ తో ఆడియన్స్ లో మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ టీజర్ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది.కాగా ఈ సెకండ్ పార్ట్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తిరుపతి అడవుల్లో పాటు జపాన్, చైనా, మలేషియా దేశాల్లో కూడా యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించబోతున్నారు. దీంతో బన్నీ జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. జిమ్ లో అల్లు అర్జున్ వర్క్ అవుట్ చేస్తున్న ఒక వీడియోని నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇక ఈ సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ కాళీమాత గెటప్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇలాంటి గెటప్స్ మరో రెండు ఉన్నాయని కూడా తెలుస్తుంది.

 

ఈ మేరకు ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ నీలం రంగు మేకప్ లో .. చీరకట్టుకుని, పూలు .. ఆభరణాలు ధరించి ఉన్నాడు. చేతికి గాజులు ధరించగా .. మెడలో నిమ్మకాయల దండ కనిపిస్తోంది. ఆవేశంతో ఆయన కనిపిస్తున్న ఈ వేషధారణ ‘మాతంగి’ అనే గ్రామ దేవతకి సంబంధించిన అవతారంలా అందరూ భావిస్తున్నారు. తిరుపతిలో వారం రోజుల పాటు జరిగే ‘గంగమ్మ జాతర’లో ఒక రోజున అమ్మవారు ‘మాతంగి’గా దర్శనమిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

అదే విధంగా ఒకప్పుడు తిరుపతి ప్రాంతంలో పాలెగాళ్ల అరాచకాలు ఎక్కువగా ఉండేవని .. గంగమ్మ తల్లి వాళ్ల దురాగతాలకు అంతం చేసిందని చరిత్ర చెబుతోంది. ‘పుష్ప 2’ కథ కూడా తిరుపతి ప్రాంతంలోనే నడుస్తూ ఉంటుంది. ‘గంగమ్మ జాతర’తో ‘పుష్ప 2’కథను సుకుమార్ ఎలా ముడిపెట్టి ఉంటాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఈ సినిమాలో ‘గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్ గా నిలవనుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Exit mobile version