Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తన నటనతో, డాన్స్ లతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్.. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
అటు మెగా ఫ్యామిలీ నుంచి.. ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా బన్నీకి అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
కాగా రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోలు అనిపించుకుంటున్నారు మన హీరోలు.
కష్టాల్లో, ఆపదలో ఉన్న అభిమానులకు హీరోలు అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అల్లు అర్జున్ కూడా ఇప్పటికే పలు మార్లు అభిమానులకు అండగా నిలబడ్డారు.
తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు బన్నీ.
అభిమాని తండ్రి కోసం అండగా బన్నీ (Allu Arjun) ..
ఇలాంటి విషయాలను పెద్దగా ప్రచారం చేసుకోవడానికి మెగా ఫ్యామిలీ ఇష్టపడక పోయినప్పటికి అభిమానుల ద్వారా ఆ విషయం బయటికి వస్తుంది. బన్నీకి డైహార్డ్ ఫ్యాన్ అయిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ట్రీట్ మెంట్ కు రెండు లక్షలకు పైగా అవసరం అవుతుంది అని వైద్యులు వెల్లడించారు. అంత స్థోమత లేకపోవడంతో.. అర్జున్ కుమార్ సోషల్ మీడియాలో విషయాన్ని తెలియజేస్తూ దాతల నుంచి సాయం కోరారు. ఈ విషయం గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడుకు తెలియడంతో బన్నీకి వివరించారు. దీంతో వెంటనే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. వెంటనే ఆ డబ్బును కూడా పంపించి అభిమానిని ఆదుకున్నాడు.
దీంతో అర్జున్ కుమార్ బన్నీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు సాయం అందించినందుకు రుణపడి ఉంటానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఇప్పటికే కేరళలో ఓ పేద విద్యార్థి చదువుకు సాయం చేసిన బన్నీ.. తన డ్రైవర్ ఇల్లు కట్టుకోవడానికి 15 లక్షలు ఆర్ధిక సాయం అందించి మంచి మనసు చాటుకున్నారు.
Thank you for helping me Annaya my hero @alluarjun ❤️🫶🏻 🤗 I wanted to express my personal gratitude for contributed. anna ❣️ &specially @imsarathchandra anna 🛐 Thank you for being a great example of leadership to me.🫡 I am forever thankful for this help anna 🤗❤️ pic.twitter.com/eB0fmdvHgV
— ᗩᖇᒎᑌᑎ ᛕᑌᗰᗩᖇ (@ArjunKumar_AAA) February 9, 2023
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప భారీ విజయాన్ని దక్కించుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం వైజాగ్ షెడ్యూల్ కూడా పూర్తైంది.
మరో వైపు నిన్ననే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానిని కలిసి ధైర్యం చెప్పాడు. ఆప్యాయంగా మాట్లాడి మనోబలాన్ని చేకూర్చారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు.. నటి పాకీజాకి ఆర్ధిక సాయం చేసిన విషయం తెలిసిందే. అలాగే సీనియర్ టెక్నీషియన్, సినిమాటోగ్రాఫర్ పి దేవరాజ్ కి చిరంజీవి ఆర్ధిక సహయం చేశారు. అభిమానులకు, నటులకు ఎవరికైనా కానీ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా మెగా ఫ్యామిలీ అండగా నిలబడుతూనే ఉందంటూ అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/