Allu Arjun: అల్లు అర్జున్‌పై నాన్‌ బెయిల్‌బుల్‌ కేసు – 5 నుంచి పదేళ్లు జైలు శిక్ష!

  • Written By:
  • Updated On - December 13, 2024 / 02:07 PM IST

Allu Arjun Arrested in Sandhya Theatre Case: హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయనను అదుబాటులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో తన ప్రమేయం ఏం లేదని, తనపై ఉన్న ఈ కేసును కొట్టివేయాలని ఇప్పటికే అల్లు అర్జున్‌ కోర్టులో పటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ పటిషన్‌ విచారణకు రాలేదు. ఈ క్రమంలో పోలీసులు నివాసంలో బన్నీని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కి తరలించారు.

తాజాగా పోలీసు స్టేషన్‌కు అల్లు అర్జున్‌ని తీసుకువేళ్లారు. ప్రస్తుతం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. అంతేకాదు అల్లు అర్జున్‌ రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105, BNS 118(1), 3/5 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. 105 నాన్‌ బెయిలబుల్‌ కేసు. ఈ సెక్షన్‌ కింది 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉంటుంది. BNS 118(1) కింద ఏడాది నుంచిపదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంటుంది.