Prime9

Akkineni Family : అక్కినేని ఫ్యామిలిలో విషాద ఘటన.. నాగార్జున సోదరి నాగ సరోజ మృతి

Akkineni Family : తెలుగు చిత్ర పరిశ్రమంలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. అలానే సుమంత్, సుశాంత్.. నిర్మాతగా సుప్రియ రాణిస్తుంది. ఇక అమల ఒకప్పుడు నటిగా రాణించగా.. ప్రస్తుతం స్టూడియో లో తన వంతు సేవలను కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా ఈ ఫ్యామిలిలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.

అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె, నాగార్జున సోదరి.. నాగ సరోజ అనారోగ్యంతో కన్నుమూసినట్లు తెలుస్తుంది. కొంత కాలంగా అనారోగ్యతవ బాధ పడుతున్న ఆమె.. పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. కాగా సినిమా పరిశ్రమకు ఆమె మొదటి నుంచి దూరంగా ఉంటుండడంతో ఆలస్యంగా విషయం బయటికి వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు నాగ సుశీల, నాగ సత్యవతి, నాగ సరోజ, వెంకట్, నాగార్జున సంతానం. వీరిలో నాగ సత్యవతి చాన్నాళ్ల కిందటే కన్నుమూశారు.

ఇప్పుడు ఈమె మరణ వార్తతో వారి కుటుంబం విషాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 20న జరిగిన ఏఎన్నార్ శతజయంతి వేడుకలలో కూడా ఆమె పాల్గొన్నారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar