Site icon Prime9

Ajith Fan Suicide : అజిత్ సినిమా చూడనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న అభిమాని.. ఎక్కడంటే?

ajith fan suicide for not allowing him to watch thunivu movie

ajith fan suicide for not allowing him to watch thunivu movie

Ajith Fan Suicide : ప్రస్తుతం కాలంలో ప్రజల్లో రెండు విషయాలు.. ఎక్కువగా, బలంగా ఉండిపోయాయి.

వాటిలో ఒకటి సినిమా అయితే మరొకటి రాజకీయం. ఈ రెండు విషయాల్లో ప్రజలు వారి జీవితాలను కూడా లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఎదుట ఉన్న వారు కూడా మనుషులే అని మర్చిపోయి రాజకీయాల కారణంగా ఒకరితో మరొకరు పోట్లాడుకోవడం, దాడి చేసుకోవడం, హత్యలు చేసుకోవడం వంటివి గమనించుకోవచ్చు.

ముఖ్యంగా ఈ పోకడ రాజకీయాలలో కనిపించేది. కానీ ఇటీవల కాలంలో సినిమా హీరోలపై అభిమానంతో కూడా ప్రజలు ఇలా మారిపోతారేమో అని భయం వేస్తుంది.

ఒక వైపు సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం అని బహిరంగంగానే చెప్పుకొని.. బాగానే ఉంటున్నారు.

కానీ వారి అభిమానులే అభిమానాన్ని హద్దులు దాటించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

అభిమానం హద్దులు దాటితే అది ఎవరికి మంచిది కాదు. సినిమా హీరోలపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది హద్దు మీరితేనే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి.

కొన్నిసార్లు ఆ అభిమానం ప్రాణాలమీదకు కూడా తీసుకొస్తుంది.

బ్యానర్లు కడుతున్నప్పుడు కింద జారిపడో, ఎలక్ట్రిక్ షాక్ తగిలో అభిమానులు చనిపోయినట్టు మనం ఇదివరకే కొన్ని సంఘటనల గురించి విన్నాం.

పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినప్పుడు కూడా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగిన సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి.

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరంటే..?

ఇక తమిళనాడులో అజిత్ సినిమా తునివు రిలీజైన రోజు అభిమానులు జరుపుకున్న సంబరాల్లోనూ ఒక అభిమాని మృతి చెందాడు.

ఇప్పుడు మరో ఫ్యాన్ ఒక విషయంలో నొచ్చుకొని, ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూత్తుక్కుడికి చెందిన వీరబాగు అనే వ్యక్తి తమిళ హీరో అజిత్‌కి వీరాభిమాని.

అజిత్ అంటే అతనికి ఎంత అభిమానం అంటే.. రిలీజ్ రోజే ఆయన సినిమాల్ని మిస్ అవ్వకుండా చూస్తాడు.

ఈసారి తునివు సినిమాని చూసేందుకు తన కుటుంబసభ్యులతో కలిసి థియేటర్‌కి వెళ్లాడు.

అయితే అతడు మద్యం తాగి ఉండటంతో, థియేటర్ సిబ్బంది అతడ్ని లోనికి అనుమతించలేదు.

మద్యం తాగిన వాళ్లను లోనికి పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అప్పుడు చిన్నపాటి వాగ్వాదం జరగ్గా.. థియేటర్ మేనేజర్ రంగంలోకి దిగాడు.

వీరబాగుని కించపరిచేలా మాట్లాడాడు. కేవలం అతని కుటుంబసభ్యుల్ని మాత్రమే థియేటర్‌లోకి అనుమతించారు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వీరబాగు థియేటర్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడు.

సినిమా అయిపోయాక ఇంటికి వెళ్లిన కుటుంబసభ్యులు.. వీరబాగుని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరయ్యారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాట వ్యాప్తంగా సంచలనంగా మారింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version