Tamil Nadu: అన్నాడీఎంకేలో మరోసారి రచ్చ మొదలైంది. పార్టీ కార్యాలయాల వద్దే ఇరు వర్గాల కార్యకర్తుల బాహాబాహీకి దిగారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అన్నాడీఎంకే పై పట్టు కోసం అటు పన్నీర్ సెల్వం, ఇటు ఎడప్పాడి పళనిస్వామి రెండు వర్గాలుగా చీలిపోయారు. పార్టీ ఒకరి చేతిలోనే ఉండాలని పళని స్వామి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
పళని స్వామి విధానాలను వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం కూడా న్యాయస్థానం తలుపు తట్టారు. అయితే అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడానికి పళని స్వామికి అనుకూలంగా తీర్పు రావడంతో రచ్చరాజుకుంది. పళని స్వామి సమావేశంపై స్టే విధించాలన్న పన్నీర్ పిటీషన్ ను మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది.
మద్రాస్ ధర్మసనం తీర్పుతో తాత్కాలిక జనరల్ సెక్రెటరీగా పళని స్వామి ఎంపిక అయ్యారు. నేడు జరిగిన కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ సమవేశంలో అన్నాడీఎంకే మొత్తం 16 తీర్మానాలను ఆమోదించారు.