Site icon Prime9

Harish Rao: 8మెడికల్ కాలేజీల్లో 12 వందల మందికి ఒకేసారి అడ్మిషన్లు.. మంత్రి హరీష్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. దీంతో 12 వందల మందికి ఓకేసారి అడ్మిషన్లు దొరకుతాయన్నారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే వచ్చాయని… మేము ఏడేళ్లలో 12 కొత్త కాలేజీలు తెచ్చుకున్నమన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం మొండిచెయ్యి చూపినా రాష్ట్రం నిధులతోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. రెండు మూడు రోజుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ రాబోతుందని స్పష్టం చేశారు.

మేము ఈ సంవత్సరం నుండి 8 కొత్త మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లను ప్రారంభిస్తాము, ఇవి 1200 సీట్లు జోడించబడతాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీ మెడికల్ సీట్లలో 85 శాతం రిజర్వేషన్ ద్వారా 1067 అదనపు ఎంబీబీఎస్ సీట్లతో కలిపి ఈ ఏడాది నుంచి 2,200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలోని ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అందిస్తున్న దసరా కానుక ఇది అని హరీష్ రావు అన్నారు.

Exit mobile version