Site icon Prime9

Actress Ileana : ఫస్ట్ టైమ్ బేబీ బంప్ చూపించిన ఇలియానా.. అలాగే “అతను” ఎవరో కూడా చెప్పమంటూ ఫ్యాన్స్ రిక్వస్ట్

actress ileana baby bump photos goes viral on social media

actress ileana baby bump photos goes viral on social media

Actress Ileana : టాలీవుడ్ కి “దేవదాసు” సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ  “ఇలియానా”. మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఆ మూవీ ఇండస్ట్రి హిట్ కావడంతో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ రెంజ్‍లో దూసుపోయింది ఈ అమ్మడు. అయితే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ట్ హీరోయిన్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొన్నాళ్ళకు బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

అయితే ఇటీవలే ఇలియానా గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకో వైపు ఇలియానా నిజంగానే తల్లి కాబోతోందా? అని ఎంతోమంది అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ అనుమానాలను బ్యాక్ చేస్తూ తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి మరోసారి షాక్ ఇచ్చింది. ఆ ఫొటోల్లో బ్లాక్ కలర్ స్లీవ్ లెగ్ గౌన్ ధరించి ఇలియానా నవ్వుతూ ఫోజులిచ్చింది. మరోవైపు తన బిడ్డకు కాబోయే తండ్రి ఎవరన్నది మాత్రం ఇప్పటికీ ఆమె సీక్రెట్ గానే ఉంచింది. దీంతో అతను ఎవరో కూడా చెప్పమంటూ ఇలియానా ఫ్యాన్స్ అంతా రిక్వస్ట్ చేస్తున్నారు.

 

ఇలియానా అంతకు ముందు ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకుని మీడియాకు కనిపించారు. అయితే, ఏమైందో? ఏమో? తెలియదు కానీ  వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ భామ.. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ లారెంట్ మైఖేల్ కు దగ్గర అయ్యారని బీ టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం గురించి కత్రీనాను కాఫీ విత్ కరణ్ షో లో కరణ్ జోహార్ ప్రశ్నించగా.. తన సోదరుడితో ఇలియానా డేటింగ్ విషయాన్ని పరోక్షంగా క్యాట్ కన్ఫర్మ్ చేసింది. దాంతో సోషల్ మీడియా వేదికగా వీరి మ్యాటర్ గురించి పోస్ట్ లు పెడుతూ ఇలియానా బేబీకి తండ్రి అతనే అంటూ పరోక్షంగా పోస్ట్ లు పెడుతున్నారు. చూడాలి మరి ఇలియానా ఈ విషయం గురించి ఎప్పుడు ఓపెన్ అవుతారో అని. మొత్తానికి అయితే ఈ బేబీ బంప్ ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

ఇలియానా బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బర్ఫీ’, ‘పటా పోస్టర్ నిఖలా హీరో’, ‘మెయిన్ తెరా హీరో’, ‘రుస్తుం’ వంటి సినిమాల్లో నటించి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఉన్నట్టుండి ఇలియానా బొద్దుగా మారడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. దీంతో మళ్లీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది.

Exit mobile version