Site icon Prime9

Karnataka: కర్ణాటకలో టోల్ ప్లాజా వద్ద బోల్తా కొట్టిన అంబులెన్స్ నలుగురు మృతి, మరో నలుగురికి గాయాలు

Karnataka: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది. రోగిని త్వరిత‌గ‌తిన ఆసుప‌త్రికి త‌ర‌లించే క్రమంలో మితిమీరిన వేగంతో వ‌చ్చిన స‌ద‌రు అంబులెన్స్ ఓ టోల్ ప్లాజా వ‌ద్ద అదుపు త‌ప్పింది. టోల్ ప్లాజాలో ప‌నిచేసే సిబ్బందిని ఢీకొట్టిన అంబులెన్స్ ఆపై మరింత దూరం దూసుకెల్లి బోల్తా ప‌డింది.

ఈ ఘ‌ట‌న‌లో అంబులెన్స్ డ్రైవ‌ర్ స‌హా న‌లుగురు చ‌నిపోగా… మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. అంబులెన్స్ టోల్ ప్లాజాకు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వాహ‌నాల దారిలో ప‌డిపోయిన ఓ డివైడ‌ర్‌ను తీసేందుకు వెళ్లిన టోల్ ప్లాజా ఉద్యోగి, అంబులెన్స్ వేగంగా దూసుకురావ‌డంతో బిత్తర‌పోయాడు. అంబులెన్స్ నుంచి త‌ప్పించుకునేందుకు అత‌డు చేసిన య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు. వేగంగా వ‌చ్చి అడ్డంగా తిరిగిన అంబులెన్స్ తొలుత ఆ టోల్ ప్లాజా ఉద్యోగినే ఢీకొట్టింది. ఆపై నేల‌పై జారుకుంటూ వెళ్లి ప‌ల్టీ కొట్టింది. దీంతో డ్రైవ‌ర్ కేబిన్‌లోని వారంతా ఎగిరి ప‌డ్డారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version