Site icon Prime9

కరోనా బీఎఫ్ 7: చైనాలో ఒక్కరోజే 3 కోట్ల 70 లక్షల కరోనా కేసులు.. భారత్ కు మళ్లీ లాక్ డౌన్ రానుందా…?

124 cases find in foreigners with 11 variants who come to india

124 cases find in foreigners with 11 variants who come to india

 Corona Variant BF.7: కరోనా మహమ్మారి విజృంభణ తగ్గి ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాధారణ జనజీవనం కొనసాగుతోందని అనుకునే లోపే.. నేను ఎక్కడికి పోలేదు.. సరికొత్తగా మళ్లీ పుట్టుకొచ్చా అంటూ మరోసారి కొవిడ్ కొత్త వేరియంట్ అయిన బీఎఫ్-7 పడగ విప్పుతోంది. అది కూడా వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్ల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీనితో చైనా దేశ ప్రజలు ప్రాణాలతో ఉంటే చాలురా దేవుడా అంటూ బిక్కుబిక్కున తీవ్రభయాందోళనలో పడిపోయారు. ఆ భయం ఎంతగా ప్రజలను కలిచివేస్తుందంటే ఏ చిన్న జబ్బు చేసినా పరుగుపరుగున ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు జనాలు. కరోనా పేషంట్లతో చైనా ఉన్న ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. బెడ్ల సరిపోక నేలపైనే రోగులకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు వైద్యులు. ఇక వీటికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండడం చూసి అక్కడి పరిస్థితుల అర్థం చేసుకోవచ్చు. ఆ పరిస్థితికి అద్దం పట్టేలా ఒక్క రోజులోనే దాదాపు మూడున్నర కోట్లకుపైగా జనం కరోనా బారిన పడడం గమనార్హం. కరోనా వైరస్ బయటపడినప్పటి నుంచి ఒక్కరోజుల్లో 3 కోట్లకుపైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.

3 crore 70 lakh corona cases in one day in China

ఒక్కసారిగా మూడున్నర కోట్లకుపైగా కేసులు..

చైనాలో మూడు రోజుల క్రితం అంటే డిసెంబర్ 20న 3 కోట్ల 70లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాకు సంబంధించిన విషయాలన్నీ మొదటి నుంచి గుట్టుగా దాచిపెడుతూ వస్తోన్న చైనా ప్రభుత్వం ఈ విషయం కూడా బయటపడకుండా చూసింది. కానీ నేషనల్ హెల్త్ కమిషన్ అంతర్గత సమావేశంలో ఈ కేసుల గురించి బయటపడింది. దీనితో ఆ దేశ ప్రజలు సహా పొరుగు దేశాలు సైతం ఈ వార్తతో ఒక్కసారిగా అప్రమత్తం అయ్యాయి.

లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు..

ఈ నెల మొదటి నుంచి డ్రాగన్ దేశాన్ని కరోనా భయం వెంటాడుతోంది. ఈ నెల 20వ తేదీ వరకు దాదాపు 24 కోట్ల 80 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. అంటే, 20 రోజుల్లోనే చైనా జనాభాలోని 18శాతం మందికి వైరస్ సోకింది. ఇక రాబోయే నెలల్లో కోట్ల మందికి వైరస్ సోకుతుందని.. దానితో లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 చైనాలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ బాధితులతో ఆసుపత్రుల్లోని ఐసీయూ బెడ్లన్నీ నిండిపోయాయి. దీంతో బెడ్లు సరిపోక నేలపైనే చికిత్స అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది చివరి నాటికి చైనాలో 20లక్షల మంది కోవిడ్ తో మరణించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

3 crore 70 lakh corona cases in one day in China

ఫోర్త్ వేవ్ ముప్పు లేనట్టేనా..

చైనాలో కరోనా కల్లోలం భారత్‌ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలో నాలుగో వేవ్‌ మొదలైపోతుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. కాగా ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బిఎఫ్‌.7 ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాపిస్తూండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కరోనా నిబంధనల్ని పాటించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. చైనాలో కేసులు పెరుగుతుండడంతో మనకు కూడా అలాంటి పరిస్థితులే వస్తే మళ్లీ లాక్ డౌన్ వస్తూందేమో అని ప్రజలు అనుకుంటున్న సమయంలో లాక్ డౌన్ ఉండదనే సమాచారం అందుతోంది. చైనాతో పోల్చుకుంటే మనకు ఫోర్త్ వేవ్ ప్రమాదం దాదాపుగా ఉండదని అంటువ్యాధి నిపుణులు భరోసా ఇస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలతో ఈ వేరియెంట్‌ను కూడా సులువుగా ఎదుర్కోవచ్చని చెప్తున్నారు. దీనితో భారత్ ప్రజలకు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇదీ చదవండి: కరోనా బీఎఫ్ 7 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Exit mobile version