Pakistan: బ్యాంకింగ్ భాషలో డాలర్ విలువ ఓపెన్ మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది.పాకిస్థానీ బ్యాంకులు విదేశీ చెల్లింపుల కోసం ‘ఓపెన్ మార్కెట్’లో డాలర్లను కొంటున్నాయి. దీనికోసం అదనంగా 35 నుండి 40 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పాకిస్తాన్ లో డాలర్ అధికారిక ధర రూ. 227 కాగా ఓపెన్ మార్కెట్లో ఇది రూ.260 గా ఉంది.
పాకిస్థాన్(Pakistan) మూడవ మార్కెట్లో డాలర్లు
సరఫరా మరియు డిమాండ్‌లో వ్యత్యాసం ఉన్నప్పుడు, ఇతర మార్కెట్లు సృష్టించబడతాయి. ఈ విధంగా పాకిస్తాన్లో (Pakistan) మూడో మార్కెట్ ఇప్పుడు డాలర్ మార్కెట్ గా మారింది.
అయితే అధికారికి రేటుకు దీనికి ఉన్న వ్యత్యాసం వలన , ఇతర దేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులు బ్యాంకుల ద్వారా దేశానికి చెల్లింపులు చేయడానికి ఇష్టపడరు.
ఎప్పుడయితే నిధులు అధికారికంగా రావో అపుడు చెల్లింపులు తగ్గిపోతాయి. బహిరంగ మార్కెట్లో చేసే చెల్లింపులు డాలర్లలో చేయవలసి ఉంటుంది. దీనివలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
రూపాయి విలువ ప్రభావం ఎంత?
2013 నుండి 2017 వరకు రూపాయి రేటను ‘అధికంగా’ పెంచడం వలన ఎగుమతులు పడిపోయాయి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, పాకిస్థాన్ లో ఆర్దిక సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చాయి.
దీనితో విదేశాల్లో ఉన్న పాకిస్థానీలు హాండీ చెల్లింపులు చేస్తున్నారు. అందువలన డాలర్లు రావడం లేదు.
మరోవైపు దేశంలో విదేవీ మారకనిల్వలు బాగుంటే ఇంటర్ బ్యాంక్ రేటును మార్కెట్ రేటుకు సమానంగా ఉంచవచ్చు.
అయితే ప్రస్తుతం అటువంటి పరిస్దితి లేకపోవడంతో డాలర్ రేటు పెరుగుతోంది.
డాలర్లు కావలసిన వారు వాటిని అధికరేటుకు కొంటున్నారు.
నానాటికి పాక్ లో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుండడంతో అక్కడి ప్రజలు తమ ప్రాణాలను నిలబెట్టుకునేందుకు వలసలు వెలువెలుతున్నారు.
ఇప్పటికే పలు దేశాలు పాక్ కు చేయూతనిందిచినప్పట్టికీ అవి ఉడతా భక్తి సాయంగానే మిగిలిపోయాయి.
ఈ ప్రభావాల వల్ల పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురవుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/