Site icon Prime9

Russia Aerial Attacks: ఉక్రెయిన్ పై రష్యా భారీ వైమానిక దాడులు.. 20 మంది మృతి.

Russia Aerial Attacks

Russia Aerial Attacks

Russia Aerial Attacks: ఉక్రెయిన్ పై రష్యా 122 క్షిపణులు మరియు 36 డ్రోన్ల తో భారీ ఎత్తున వైమానిక దాడులకు దిగింది. 22 నెలల యుద్ధంలో శుక్రవారం జరిగినది అతిపెద్ద వైమానిక దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడుల్లో సుమారు కనీసం 20 మంది పౌరులు మరణించారు. ఉక్రెయిన్ వైమానిక దళం 87 క్షిపణులు, 27 డ్రోన్లను అడ్డగించిందని ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ వాలెరి జలుజ్నీ చెప్పారు.

88 మందికి గాయాలు..(Russia Aerial Attacks)

ఎయిర్ ఫోర్స్ కమాండర్ మైకోలా ఒలేష్‌చుక్ తన అధికారిక టెలిగ్రామ్‌పై అత్యంత భారీ వైమానిక దాడి అని వర్ణించారు.గతంలో 2022 నవంబర్‌లో రష్యా ఉక్రెయిన్‌పై 96 క్షిపణులను ప్రయోగించింది. ఈ ఏడాది మార్చి 9న 81 క్షిపణులను ప్రయోగించింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలతో సహా ఆరు నగరాలపై వైమానిక దాడి జరిగింది. సుమారు 18 గంటల దాడిలో 88 మంది గాయపడ్డారు. పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ అంతటా దెబ్బతిన్న భవనాలలో ప్రసూతి ఆసుపత్రి, అపార్ట్మెంట్ బ్లాక్‌లు మరియు పాఠశాలలు ఉన్నాయి.ఈ రోజు మిలియన్ల మంది ఉక్రెయిన్ ప్రజలు పేలుళ్ల శబ్దానికి మేల్కొన్నారు. ఉక్రెయిన్‌లోని పేలుళ్ల శబ్దాలు ప్రపంచవ్యాప్తంగా వినబడాలని నేను కోరుకుంటున్నాను అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు.ఉక్రెయిన్ మిత్రదేశాలు తమ మద్దతును పెంచాలని పిలుపునిచ్చారు.
1991లో సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌లో భాగంగా గుర్తించబడిన భూభాగంలో రష్యా దాదాపు 17.5% నియంత్రిస్తుంది. మాస్కో 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకుంది.

Exit mobile version