Site icon Prime9

Ukraine : ఉక్రెయిన్ రాకెట్ దాడుల్లో 63 మంది రష్యా సైనికుల మృతి

ukraine

ukraine

Ukraine : ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంలో … రష్యాకు కోలుకోలేని దెబ్బతగిలింది. రష్యాకు చెందిన సుమారు 63 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా కూడా అంగీకరించింది. ఇప్పటి వరకు ఈ స్థాయిలో రష్యా సైనికులు మృతి చెందడం ఇదే మొదటిసారి అని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణమైన కమాండర్‌ను శిక్షంచాలని రష్యా సోషలో మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తూ పోస్టు పెడుతున్నారు.

ఇంత మంది సైనికులు మృతి చెందడం రష్యన్‌ సైనికుల స్వయంకృతాపరాథమే. ఉక్రెయిన్‌ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న డొనెస్క్‌ ప్రాంతంలోని ఒక మందుగుండు సామగ్రి ఉన్న డిపో వద్ద రష్యా సైనికులకు వసతి ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌ పేల్చిన క్షిపణులు రష్యా మందుగుండు డిపోపై పడి భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లకు 63 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా కూడా అంగీకరించింది.

రష్యా సైనికుల నివాసంపైకి అమెరికాలో తయారు చేసిన నాలుగు రాకెట్లు ప్రయోగించింది ఉక్రెయిన్‌. కాగా రెండు రాకెట్లను రష్యా కూల్చివేసినట్లు చెబుతోంది. అయితే ఉక్రెయిన్‌ మాత్రం తాము ప్రయోగించిన రాకెట్లకు వందలాది మంది చనిపోయారని చెబుతోంది. రష్యా అధికారులు దీన్ని ఖండిస్తూ మృతుల సంఖ్యను ఉక్రెయిన్‌ ఎక్కువగా ఊహించుకుంటోందని చురకలంటించింది. రష్యా మిలిటరీ బ్లాగర్స్‌ వాటిని ఫాలో అయ్యే వందలాంది మంది ఫాలోవర్స్‌ మాత్రం పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మిలిటరీ బ్యారక్‌లు ఉన్న భవనంలో మందుగుండు సామగ్రి నిల్వ ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(ఇదిలా ఉండగా సోమవారం నాడు ఉక్రెయిన్‌ … రష్యాకు చెందిన 39 డ్రోన్‌లను కూల్చివేశామని ప్రకటించింది. కాగా రష్యా వరుసగా మూడో రోజు కూడా కీవ్‌తో పాటు ఇతర నగరాలపై రాత్రి పూట డ్రోన్లతో దాడులకు పాల్పడుతోందని..ఈ సారి మొత్తం 39 డ్రోన్లు నేలకూల్చామని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్‌ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌పై ఎడతెరిపి లేకుండా దాడులకు పాల్పడుతోంది. దీంతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు అంధకారంలో మగ్గాల్సిన పిరస్థితి ఏర్పడింది. దీంతో ఉక్రెయిన్‌ కూడా ఎయిర్‌ డిఫెన్స్‌సిస్టమ్‌ను బలోపేతం చేసుకుంది.

Exit mobile version