Turkish MP: పార్లమెంటులో ఇజ్రాయెల్‌ను విమర్శిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన టర్కీ ఎంపీ హసన్ బిట్మెజ్ గురువారం మరణించారు. ప్రతిపక్ష ఫెలిసిటీ (సాడెట్) పార్టీకి చెందిన 54 ఏళ్ల హసన్ బిట్మెజ్ ఏళ్ల అంకారా సిటీ ఆసుపత్రిలో మరణించారని టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు.బిట్మెజ్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ యూనియన్ రీసెర్చ్ చైర్మన్ మరియు గతంలో ఇస్లామిక్ ప్రభుత్వేతర సంస్థల కోసం పనిచేశారు.
అధ్యక్షుడిని తప్పు బట్టి..(Turkish MP)
బిట్మెజ్ మంగళవారం టర్కీ పార్లమెంట్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. మనం మనస్సాక్షిని దాచవచ్చు కానీ చరిత్ర నుండి కాదని చెప్పారు. మీరు అల్లా యొక్క ఆగ్రహం నుండి తప్పించుకోలేరు అంటూ ఇజ్రాయెల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌తో వాణిజ్యాన్ని కొనసాగించినందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ను ఆయన విమర్శించారు. మీరు ఇజ్రాయెల్‌కు ఓడలను వెళ్ళడానికి అనుమతిస్తారు మరియు మీరు దానిని సిగ్గు లేకుండా వాణిజ్యం అని పిలుస్తారు.మీరు ఇజ్రాయెల్ సహచరులు. మీ చేతులపై పాలస్తీనియన్ల రక్తం ఉంది. మీరు సహకారులు. గాజాపై ఇజ్రాయెల్ వేసిన ప్రతి బాంబుకు మీరు సహకరిస్తారు అని నిందిస్తూ పోడియం పై బ్యానర్ ను కూడా ఉంచారు. తన ప్రసంగాన్ని ముగించిన తరువాత అతను వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు.బిట్మెజ్ ను పార్లమెంటు నుంచి ఆసుపత్రికి తరలించగా అక్కడ ఇంటెన్పివ్ కేర్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.