Site icon Prime9

Indonesia: బద్ధలైన సెమేరు అగ్నిపర్వతం.. ఆ ప్రాంతమంతా డేంజర్ జోన్

Thousands evacuated after Indonesia’s Mount Semeru erupts

Thousands evacuated after Indonesia’s Mount Semeru erupts

Indonesia: ఇండోనేసియాలోని అతి ఎత్తయిన అగ్నిపర్వతం ‘మౌంట్ సెమేరు’ బద్దలైంది. దీనితో సెమేరు చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ కమ్ముకుని చుట్టుపక్కల ప్రాంతాల వారిని కలవరానికి గురిచేసింది. అలాగే, దాదాపు 19 కిలోమీటర్ల మేర బూడిద వ్యాపించి ఆవాసాలను, అన్నింటిని పూర్తిగా కప్పేసింది. అప్రమత్తమైన అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 2 వేల మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఆదివారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో అగ్నిపర్వతం విస్ఫోటన ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా పరిస్థితులు మరింత విషమించాయి. దీంతో పర్వతం చుట్టూ 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిని డేంజర్ జోన్‌గా ప్రకటించారు. అలాగే, లావా తాకే అవకాశం ఉన్న బెసుక్ కొబోకాన్ నది ఆగ్నేయ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

జావా ద్వీపంలో ఉన్న ఈ ‘మౌంట్ సెమేరు’ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం ఇది వరుసగా మూడో ఏడాది. గతేడాది డిసెంబరులో సంభవించిన పేలుడులో 50 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది.

ఇదీ చదవండి: అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చెయ్యాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version