Dubai: ఆ దేవాలయ నిర్మాణాన్ని భక్తులకు అద్భుత అనుభూతిని కల్గించేలా చేపట్టారు. భారత దేశ సనాతన హిందూ మతంలోని పలు దేవతామూర్తుల విశిష్టత తెలియచేసాలా రూపుదిద్దారు. మనదేశంలోని నలుమూలల ప్రాంతాల్లోని దేవతామూర్తులకు చేపట్టే ఆరాధనలను ఒకే ప్రాంగణంలో వీక్షించేలా కొలువదీర్చారు. నాలుగు భారీ పిల్లర్లపై నిర్మించిన ఆ సుందరమైన ప్రదేశానికి చేరుకోవాలంటే మనం విమానం వెక్కాల్సిందే.
వివరాల్లోకి వెళ్లితే…యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో జేబెల్ అలీ ప్రాంతంలోని వర్షిప్ గ్రామంలో కొత్తగా నిర్మించిన హిందూ టెంపుల్ పేరుతో కొత్త ఆలయాన్ని భక్తుల దరి చేర్చారు. విజయదశమి పర్వదినం నుండి ఆలయాన్ని దర్శించుకొనేందకు భక్తులకు అనుమతి కల్గించారు. భారత దేశంలోని నలుమూలల ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధి దేవతామూర్తుల విగ్రహాలను ఒకే చోట ప్రతిష్టించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రూపుదిద్దిన 16 దేవతామూర్తుల విగ్రహాలు భక్తులను ఇట్టే కట్టి పడేస్తున్నాయి.
ఈ ఆలయ నిర్మాణాన్ని 2020లో ప్రారంభించారు. కేవలం 4 పిల్లర్ల మీద సుందరంగా, రమణీయంగా తీర్చిదిద్దారు. విజయదశమి పర్వదినాన యుఏఇ దేశ సంస్కృతి, యువత, సామాజిక అభివృద్ధి మంత్రి షేక్ నహయాన్ బిన్ ముబారక్ అల్ నహయన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారతదేశ దుబాయ్ రాయబారి సంజయ్ సుధీర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేపట్టారు.
భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని హిందువులు పూజించే 16 రకాల దేవతామూర్తులను ఆలయంలో ప్రతిష్టించారు. అందరి విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. దుబాయ్ లో నివసిస్తున్న హిందువుల అందరూ, వారి వారి ఆరాధ్య దేవతలను ఒకే ప్రాంగణంలో పూజించుకొనే విధంగా ఆలయాన్ని రూపుదిద్దారు.
దసరా నుండి ఆలయాన్ని అధికారికంగా ప్రారంభమైన్నప్పటికి, సెప్టెంబర్ 1నుండే ఆలయంలో భక్తులు సందర్శించుకొనేలా ఏర్పాటు చేశారు. అయితే ముందస్తుగా పేర్లను నమోదు చేసుకొన్న వారికి రోజుకు వెయ్యి మంది లెక్కన దేవతామూర్తుల దర్శన భాగ్యాన్ని నిర్వాహకులు కల్పించారు. ఆలయం ప్రారంభం అనంతరం నమోదు పక్రియ లేకుండానే నేరుగా భక్తుల దర్శనం చేసుకొంటున్నారు. మనసుకు ప్రశాంతత కల్గించేలా తలపెట్టిన భవన నిర్మాణంలో పూర్తిగా పాలరాతిని ఉపయోగించారు. అందులో భారత్, అరబిక్ ప్రాంతాలను ప్రతిబంభింస్తూ ఉండేలా చేపట్టారు.
ఆ గ్రామంలో ఈ ఆలయంతోపాటు వివిధ మతాలకు చెందిన దేవాలయాలు, గురుద్వారాలు, ప్రార్ధనా స్ధలాలు కూడా ఉంటూ విభన్న వర్గాల ఆధ్యాత్మికతకు నిలయంగా మారడంతో పలువురు భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:Tirupati Devotes : వెంకన్న దర్శనం కోసం కి.మీ మేర బారులు తీరిన భక్తులు…