Site icon Prime9

South Africa: 11వేల అడుగుల ఎత్తులో విమానం.. కాక్ పిట్ లో విషనాగు ప్రత్యక్షం

South Africa

South Africa

South Africa: ఆకాశంలో విమానం ఎగురుతోంది.. మార్యమధ్యలో కాక్ పిట్ లో అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా కనిపిస్తే పరిస్థితి ఏంటి? అక్కడిక్కడే ప్రాణాలు పోయినంత పని జరుగుతుంది. ఇలాంటి సంఘటనే దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. నలుగురు ప్యాసింజర్లతో ఓ విమానం దక్షిణాఫ్రికాలోని వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్ కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పైలట్ రుడాల్స్ ఎరాస్మస్ కు కాక్ పిట్ లో అలికిడి వినిపించింది.

 

అదేంటో చూడగా తన సీటు కింద పామును గుర్తించాడు. అయితే పామును చూసిన పైలట్ భయపడలేదు. ఎంతో ధైర్యంగా పరిస్థితిని చక్కదిద్దాడు. పాము కనిపించిన విషయాన్ని కంట్రోల్ రూమ్ కు తెలిపడంతో .. వారు జోహెన్నెస్ బర్గ్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. దీంతో అతను విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడ్డారు. దీంతో పైలట్ ధైర్యసాహసాలకు అధికారులు, ప్రయాణికులు, విమాన సిబ్బంది అతనిని అభినందించారు. పాము కనిపించిన సమయంలో విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉంది.

 

ల్యాండింగ్ తర్వాత దొరకని ఆచూకీ(South Africa)

కాగా, విమాన ప్రయాణానికి ముందే వార్సెస్టర్ ఎయిర్ పోర్టు సిబ్బంది విమాన రెక్కల కింద పామును గుర్తించారు. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఎంతకీ ఆచూకీ పాము దొరకలేదు. దీంతో పామును బయటకు వెళ్లిపోయిందని సిబ్బంది అనుకున్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పాము మళ్లీ కాక్ పిట్ లో ప్రత్యక్షమైంది. ఇదిలా ఉంటే జోహన్నెస్ బర్గ్ ఎయిర్ పోర్టులో విమానం దిగిన తర్వాత కూడా పామును పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే పాము కనిపించలేదు. దీంతో లాభం లేక ఇంజనీర్స్ పిలిపించి విమాన భాగాలను విప్పి చూసినా లాభం లేకుండా పోయింది.

 

 

Exit mobile version