Site icon Prime9

Secure ranks: సురక్షిత దేశంగా మొదటి ర్యాంకులో సింగపూర్…భారత్ కు 60 వ ర్యాంకు

Singapore ranks first as the safest country...India ranks 60th

Singapore ranks first as the safest country...India ranks 60th

Washington: ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం సురక్షితమైంది, ఏ ఏ దేశాల్లో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయో తెలుపుతూ గ్లోబల్ అనలిటిక్స్ సంస్ధ గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ ను విడుదల చేసింది. జాబితాలో 96 పాయింట్లు సాధిస్తూ సింగపూర్ తొలి స్థానంలో నిలబడింది. భారత దేశం 80 పాయింట్ల సాధించి 60వ స్థానంలో నిలిచింది.

తజికిస్తాన్, నార్వే, స్విట్జర్లాండ్, ఇండోనేషియా దేశాలు మొదటి 5స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల పరంగా శ్రీలంక, పాకిస్ధాన్ దేశాల్లో స్వల్ప తేడాలు ఉండడం గమనార్హం. బ్రిటన్ మన దేశానికి కన్నా వెనుకలో ఉండిపోయింది. 51 పాయింట్లతో అత్యంత అసురక్షిత దేశంగాతాలిబన్లు అధీనంలోని ఆఫ్గానిస్ధాన్ నిలిచింది. ఆప్గాన్ కన్నా దిగువగా గాబన్, వెనిజువెలా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా, లియోన్ దేశాలు ఉండడం గమనార్హం. గత ఏడాది జరిగిన దాడులు, దోపిడీల, ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారు అన్న అంశాల నేపథ్యంలో గ్లోబల్ అనలిటిక్స్ సంస్ధ గాలప్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Ministry of External affairs: భారత్ లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కమిటీ రెండు రోజుల సమావేశం.. హాజరుకానున్న బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి

Exit mobile version