Site icon Prime9

Road Accident : పొగ మంచు కారణంగా భారీ ప్రమాదం.. 158 వాహనాలు ఢీ.. ఎంత మంది చనిపోయారంటే ?

Road Accident due to fogg at america leads to 158 vehicles hitting

Road Accident due to fogg at america leads to 158 vehicles hitting

Road Accident : శీతాకాలంలో పొగమంచు కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరగడం మనం గమనించవచ్చు. అయితే అమెరికాలో తాజాగా జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపు 158 వాహనాలు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా.. 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఊహించని ఈ దుర్ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని లూసియానాలో గల న్యూ ఓర్లానో సమీపంలోని పాంట్‌ చార్ట్రెయిన్‌ వద్ద ఉన్న ఓ బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్‌స్టేట్‌-55 రహదారిపై దాదాపు 158 వాహనాలు పోగా మంచు కారణంగా ఢీకొన్నాయి. దీంతో వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.  దీంతో ఆ బ్రిడ్జిపై మొత్తం ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలు ఒకదానిపై ఒకటి పడ్డాయి. కార్లు, ట్రక్కులు, బైక్‌లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఘటనా స్థలంలోనే కాలి బూడిదయ్యాయి.

అయితే ఈ వాహనాలు ఢీకొనే ప్రక్రియ దాదాపు అరగంట పాటు జరిగినట్లు అక్కడే ఉన్న వాహనదారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వాహనాల్లో ఉన్న జనం బయటికి వచ్చి వెనుక వస్తున్న వాహనాలకు సైగలు చేసినా పొగమంచు కారణంగా కనిపించకపోవడంతో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనలో ఒక కారు ఏకంగా బ్రిడ్జిపై నుంచి నీటిలో పడిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన విషయాన్ని పోలీసులు, సహాయక సిబ్బందికి సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టార. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

Exit mobile version